Asianet News TeluguAsianet News Telugu

అల్లు అర్జున్ కు సర్ ప్రైజింగ్ పార్టీ ఇచ్చిన మామ చంద్రశేఖర్, ఎవరెవరు వచ్చారంటే..?

టాలీవుడ్ నుంచి మొదటి సారి ఉత్తమ నటుడిగా  జాతీయ అవార్డ్ అందుకున్నాడు అల్లు అర్జున్. సరికొత్త రికార్డ్ సాధించిన ఆయనకు హైదరాబాద్ లో అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది.  అంతే కాదు.. బన్నీ మామ గ్రాండ్ పార్టీ కూడా ఇచ్చారు. 
 

Allu Arjun Father In Law Chandrasekhar Reddy Grand Party For Bunny Achieved National Award JMS
Author
First Published Oct 20, 2023, 8:48 AM IST | Last Updated Oct 20, 2023, 8:48 AM IST

2021 సంవత్సరానికి గాను ఉత్తమ జాతీయనటుడిగా అవార్డ్ గెలుచుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారాల వేడుకల్లో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా తమ అవార్డును అందుకున్నారు అల్లు అర్జున్.  అవార్డ్ అందుకుని హైదరాబాద్ వచ్చిన బన్నీకి గ్రాండ్ వెల్కం లభించింది. ఇక అభిమానుల వెల్కం తరువాత.. అల్లు అర్జున్ మామ, స్నేహ రెడ్డి వాళ్ళ నాన్న చంద్రశేఖర్ రెడ్డి తన అల్లుడికి నేషనల్ అవార్డు వచ్చినందుకు స్పెషల్ గా గ్రాండ్ పార్టీ అరేంజ్ చేశారు. 

అయితే కొంత మంది  కుటుంబ సభ్యులు, పుష్పు మూవీ నుంచి మెయిన్ యూనిట్ తో పాటు.. మరి కొంతమంది సన్నిహితులు, స్నేహితులకు  మాత్రమే ఈ పార్టీని అరేంజ్ చేశారు. దీంతో ఈ పార్టీలోని ఫోటోలు వైరల్ గా మారాయి. ఇక ఈ పార్టీలో అల్లు అరవింద్ తన ముగ్గురు కొడుకుల‌ు.. మరికొంత మందితో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో  వైరల్ గా మారాయి.

ఇక ఈసారి  తెలుగు రాష్రాల నుంచి దాదాపు 10 జాతీయ అవార్డ్  రాగా.. అందులో మొట్ట మొదటి సారి తెలుగు నుంచి ఉత్తమ కథానాయకుడిగా అల్లు అర్జున్ పుష్ప సినిమాకు అందుకున్నాడు. పుష్ప సినిమాలో తన నటనకు గాను నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ. ఈ అవార్డ్ వేడుకలకు తన భార్య స్నేహా.. తండ్రి అల్లు అరవింద్ తో కలిసి హాజరయ్యాడు అల్లు అర్జున్. 

ఇక తెలుగు సినిమాకు 69 ఏళ్లుగా ఒక కలలా ఉన్న ఆ అవార్డుని సాధించి అల్లు అర్జున్ తెలుగు ఇండస్ట్రీకి కానుకగా తీసుకురావడంతో.. బన్నీకి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. అవార్డుని అందుకున్న అల్లు అర్జున్.. నిన్న హైదరాబాద్ లోని తన ఇంటికి చేరుకున్నాడు. ఇక బన్నీ కోసం అక్కడే ఎదురు చూస్తున్న అభిమానులు.. అక్కడ తెగ సందడి చేశారు.. ఒక పండుగాలా సెలబ్రేట్ చేశారు. 

బాణాసంచా కలుస్తూ పూల వర్షం కురిపిస్తూ అల్లు అర్జున్ కి ఘనంగా ఆహ్వానం పలికారు. ఇక అభిమానుల అందరికి థాంక్యూ చెబుతూ, అభివాదం పలుకుతూ ఇంటికి చేరుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను అభిమానులు తమ సోషల్ మీడియాలో షేర్ చేయగా ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా అల్లు అర్జున్ మొదటి నేషనల్ అవార్డుని తీసుకు రావడమే కాదు, రీజనల్ సినిమా, కమర్షియల్ సినిమా అని తక్కువగా చూసే ఎంతో మందికి అల్లు అర్జున్ గట్టి సమాధానం ఇచ్చి.. పుష్ప తగ్గేదేలే అనిపించాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios