Asianet News TeluguAsianet News Telugu

యానిమల్ సాంగ్ కు అల్లు అర్హా అదిరిపోయే స్టెప్పులు.. వైరల్ అవుతున్న వీడియో

డాన్స్ పెర్ఫామెన్స్ తో అదరగొట్టింది..అల్లువారి స్టార్ కిడ్ అల్లు అర్హా. అది కూడా యానిమల్ సినిమాలోని వైరల్ సాంగ్ కు డాన్స్ చేసి..తాను కూడా వైరల్ అయ్యింది చిన్నారి. 

Allu Arjun Daughter Allu Arha Dance with Animal Movie jamal kudu song JMS
Author
First Published Feb 24, 2024, 2:34 PM IST

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ వీడియోలు ఎప్పటికప్పుడుఅభిమానులను అలరిస్తూనే ఉంటాయి. వారి యాక్టివిటీస్ తో పాటు.. పెర్ఫామెన్స్ లు కూడా ఎప్పటికప్పుడు నెట్టింట సందడి చేస్తుంటాయి. ఇక సోసల్ మీడియాలో  బన్నీ కుమారుడు అల్లు అయాన్, కూతురు అల్లు అర్హల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్ల క్రేజ్ కుసామానంగా అల్లు పిల్లల క్రేజ్ పెరుగుతూ వస్తోంది.  మరీ ముఖ్యంగా అల్లు అర్హ ఇప్పటికే  సినిమాల్లో నటిస్తూ.. సోషల్ మీడియాలో సందడి చేస్తూ.. హీరోయిన్లతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ ను సొంతం చేసుకుంది. 

అర్హ అల్లరి వీడియోలు, ఫొటోలను తరచూ సోషల్‌ మీడియాలో షేర్ చేస్తుంటారు అల్లు అర్జున్, స్నేహా రెడ్డి దంపతులు. దీంతో స్టార్ కిడ్ గా ఇప్పటికే మస్త్ క్రేజ్ సంపాదించుకుంది అల్లు అర్హ. ఇక తాజాగా అల్లు అర్హాకుసబంధించిన మరో వీడియో సందడి చేస్తోంది. యానిమల్ సినిమాలో బాగా పాపులర్ అయ్యి.. సూపర్ హిట్‌ అయిన  పాటకు అల్లు అర్హా సూపర్ గా డాన్స్ వేసి సందడి చేసింది. అదరిపోయే స్టెప్పులతో అర్హా దుమ్మురేపింది. బన్నీ బన్నీ గారాల పట్టి జమల్ కుదు సాంగ్ ను తనదైన శైలిలో రీక్రియేట్ చేసింది. అయితే ఈసాంగ్ కోసం బాబీ డియోల్ తలపై గ్లాస్ పెట్టుకుంటే.. అర్హా మాత్రం తలపై ప్లేట్ పెట్టుకుని డాన్స్ చేసింది. ఇక ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

 

అభిమానులు నెటిజన్లు రకరకాల కామెంట్లుపెడుతున్నారు. అల్లు అర్జున్ కూతురు కదా.. ఆమాత్రం డాన్స్ చేయాల్సిందే మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్హా ఇటు సినిమాల్లో కూడా వరుస అవకాశాలు సాధిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం సినిమాలో చిన్నారి భరతుడి పాత్రలో కనిపించిమురిపించింది. ఈ పాత్రకుమంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక తాజాగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్ ల కాంబినేషన్‌లో వస్తోన్న దేవరలోనూ అల్లు అర్హ నటించనుందని సమచారం. జానీ కపూర్ చిన్నతనంలో పాత్రను చిన్నారి అర్హా పోషించనుందట. 

ఇక ఈ విషయం రూమర్ గానే ఉంది. అటు అల్లు ఫ్యామిలీ కాని..ఇటు దేవర టీమ్ కాని ఈ ప్రకటన చేయలేదు. ఇండస్ట్రీలో టాక్ మాత్రంగట్టిగా ఉంది. ఇక ఈసినిమా నిజంగానే అర్హా చేస్తే.. అవకాశాలు ఇంకా ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక అల్లుఅర్జున్ మాత్రం పు్ప సీక్వెల్ తో బిజీగా ఉన్నాడు. ఈసినిమా 1000 కోట్ల టార్గెట్ లో చాలా జాగ్రత్తగా చెక్కుతున్నారు. సుకుమార్‌ డైరెక్ట్ చేస్తున్నఈ ఊరమాస్‌ ఎంటర్‌ టైనర్ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. రష్మిక మందన్న హీరోయిన్. సునీల్, అనసూయ, జగదీశ్‌, ఫాహద్ ఫాజిల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios