Asianet News TeluguAsianet News Telugu

'96' రీమేక్.. తెరపైకి స్టార్ హీరో పేరు!

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన '96' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నారు.

Allu Arjun considering 96 remake
Author
Hyderabad, First Published Nov 16, 2018, 2:09 PM IST

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన '96' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమా రీమేక్ హక్కులను దక్కించుకున్నారు. తెలుగు రీమేక్ కోసం నాని, శర్వానంద్ వంటి హీరోల పేర్లు వినిపించినప్పటికీ తాజాగా హీరో అల్లు అర్జున్ ఈ రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా చూసిన అల్లు అర్జున్ రీమేక్ చేయడంపై సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఒరిజినల్ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ని పిలిపించి కథలో కొన్ని మార్పులు చేయమని చెప్పినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కథను మళ్లీ రాస్తున్నాడు దర్శకుడు ప్రేమ్ కుమార్.

అన్నీ కుదిరితే గనుక ఈ రీమేక్ సినిమాతో దర్శకుడు ప్రేమ్ తెలుగు తెరకు దర్శకుడిగా పరిచయమవుతాడు. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రాబోయే సినిమా కూడా బాలీవుడ్ సినిమా రీమేక్ అని టాక్. ఒరిజినల్ కథల మీద నమ్మకం లేక ఆల్రెడీ హిట్ అయిన కథలను బన్నీ నమ్ముకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios