నాగబాబు నాన్న కుచ్చి నిహారిక నిశ్చితార్ధ వేడుక నిన్న రాత్రి ఘనంగా జరిగింది. జొన్నలగ్గడ్డ చైతన్య-నిహారికల జంట చూడముచ్చటగా ఉంది. చాలా కాలం తరువాత మెగా ఫ్యామిలీలో జరుగుతున్న ఈ వేడుకకు కుటుంబ సభ్యులందరూ హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి దంపుతులతో పాటు మెగా ఫ్యామిలీ నుండి ప్రతి ఒక్కరు ఈ వేడుకకు హాజరుకావడం జరిగింది. నాగబాబు తమ్ముడైన పవన్ కళ్యాణ్ మాత్రం ఎందుకో ఈ వేడుకలో కనిపించలేదు. కాగా అల్లు అర్జున్-స్నేహారెడ్డి కూడా ఈ వేడుకకు హాజరుకావడం జరిగింది. ఐతే ఈ వేడుకలో అందరీ కళ్ళు ఈ జంటపైనే అంటే నమ్మాల్సిందే. టాప్ టు బాటమ్ బ్లాక్ టక్ ఇన్ లో జెంటిల్ మెన్ లుక్ లో బన్నీ అటెండ్ కాగా, స్నేహారెడ్డి పర్ఫుల్ కలర్ డిజైనర్ వేర్ లో వచ్చారు. 

ఈ స్టైలిష్ కపుల్ ని చూసిన పెళ్లి బంధువులు ఆశ్చర్యపోయారట. వీరికి ఇద్దరు పిల్లలా అని ముక్కున వేలు వేసుకున్నారట. బన్నీ సంగతి సరే, స్నేహారెడ్డి ఆయన ప్రక్కన స్టార్ హీరోయిన్స్ రేంజ్ లో కనిపించడం విశేషం. కొత్త జంట నిహారిక- చైతన్యలు సైతం డామినేట్ అయ్యేలా ఈ జంట అందంగా ఉందని చెప్పుకున్నారట. ఇక ఫోటోగ్రాఫర్స్ ఫోకస్ మొత్తం వీరిపైనే పెట్టారట. వేడుక నిహారిక- చైతన్యలది అయితే సందడి మాత్రం వీరిది అన్నట్లు అక్కడ వ్యవహారం తయారైంది. ఇక సోషల్ మీడియాలో సైతం అల్లు అర్జున్-స్నేహారెడ్డి దంపతుల ఫొటోలో వైరల్ అవుతున్నాయి. బన్నీ ఫ్యాన్స్ కూడా తమ స్టైలిష్ హీరో లేటెస్ట్ లుక్ చూసి  వాహ్ అంటున్నారు. 

నేషనల్ మీడియా సైతం అల్లు అర్జున్ మరియు స్నేహ రెడ్డిల ఫోటోల గురించి రాసిందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఏవిధంగా చూసినా ఇది నిహారిక-చైతన్యలను నొచ్చుకొనేలా చేసే అంశమే కదా.  2011లో అల్లు అర్జున్ స్నేహారెడ్డిని లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నారు. వీరికి అయాన్, అర్హ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక అల్లు అర్జున్ త్వరలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప మూవీ షూట్ లో పాల్గొనాల్సివుంది. అలాగే ఆయన తన 21వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

When you dress up after months❤️👗: @manishmalhotra05 @manishmalhotraworld stylist: @harmann_kaur_2.0

A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) on Aug 14, 2020 at 12:32am PDT