Asianet News TeluguAsianet News Telugu

నాని, బన్నీ కలిసి పార్టీ చేసుకున్నారు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని కలిసి తాజాగా తమకి సన్నిహితుడైన ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన సంగీత్ పార్టీలో ఇద్దరు ఏహీరోలు చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

allu arjun and nani party together
Author
Hyderabad, First Published Aug 30, 2018, 4:35 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, నేచురల్ స్టార్ నాని కలిసి తాజాగా తమకి సన్నిహితుడైన ఓ వ్యక్తి పెళ్లికి హాజరయ్యారు. అయితే ఈ పెళ్లికి సంబంధించిన సంగీత్ పార్టీలో ఇద్దరు ఏహీరోలు చేసిన సందడి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోలో అల్లు అర్జున్ 'ఆర్య2' సినిమాలో 'గుప్పెడంత ఈ ప్రేమకి' పాటను స్టేజ్ మీద పడుతున్న సమయంలో హీరో నాని.. బన్నీ భార్య స్నేహారెడ్డిని కూడా స్టేజ్ పైకి తీసుకెళ్లాడు.

బన్నీ పాట పాడగా.. స్నేహా ఆ పాటను ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తోంది. అలానే నాని 'ఎటో వెళ్ళిపోయింది మనసు' సినిమాలో పాటను పాడారు. బన్నీ, నాని తమ భార్యలతో కలిసి స్టేజ్ మీద పాటలు పాడి అక్కడున్న వారిని మరింత ఎంటర్టైన్ చేశారు.

ఈ ఏడాది 'నా పేరు సూర్య' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ ఇప్పటివరకు తన తదుపరి సినిమాను అనౌన్స్ చేయలేదు. ఇక నాని 'దేవదాస్' సినిమాలో నటిస్తున్నాడు. అలానే 'జెర్సీ' సినిమా అనౌన్స్ చేశారు. వీటితో పాటు చాలా కథలు చర్చల దశల్లో ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios