Asianet News TeluguAsianet News Telugu

గీత గోవిందంను అమ్మడం కుదరదట?

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీత గోవిందం బాలీవుడ్ లో తెరకెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించిన ఆ సినిమాపై నార్త్ ఇండస్ట్రీ ప్రముఖులు గత కొన్ని రోజులుగా రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 

allu aravind bollywood remake  plans
Author
Hyderabad, First Published Jan 5, 2019, 10:22 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన గీత గోవిందం బాలీవుడ్ లో తెరకెక్కనుందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 70 కోట్లకు పైగా కలెక్షన్స్ అందించిన ఆ సినిమాపై నార్త్ ఇండస్ట్రీ ప్రముఖులు గత కొన్ని రోజులుగా రీమేక్ హక్కులను దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. 

అయితే తెలుగులో సినిమాను నిర్మించిన గీత ఆర్ట్స్ సంస్థ బాలీవుడ్ కి సినిమాను అమ్మడానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. ఎందుకంటే నిర్మాత అల్లు అరవింద్ సినిమాను సొంత బ్యానర్ లో బాలీవుడ్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అప్పట్లో తమిళ్ సినిమా గజినీని బాలీవుడ్ లో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్న అల్లు అరవింద్ చాలా రోజుల తరువాత మళ్ళీ బాలీవుడ్ లో సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. 

బాలీవుడ్ రీమేక్ లో గోవిందంగా ఇషాన్ ఖతార్ ని సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇంకా హీరోయిన్ ని అలాగే ఇతర టెక్నీషియన్స్ ఫైనల్ చేయాల్సి ఉంది. గీత గోవిందం సినిమాకు తెలుగులో పరశురామ్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios