Asianet News TeluguAsianet News Telugu

నరేష్ నాంది చిత్రానికి రికార్డు ఐ ఎం డి బి రేటింగ్!

నాంది చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులను నరేష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా నాంది చిత్రానికి ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐ ఎం డి బి అత్యధిక రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఐ ఎం డి బి ఏకంగా ఈ చిత్రానికి 9.9 ఇవ్వడం గమనార్హం. 

allari naresh nandhi gets record imdb rating ksr
Author
Hyderabad, First Published Feb 21, 2021, 3:43 PM IST

నవ్వుతూ నవ్విస్తూ ఉండే అల్లరి నరేష్ కన్నీరు పెట్టుకున్నారు. తన రెగ్యులర్ జోనర్ నుండి బయటికి వచ్చి ఓ సీరియస్ సబ్జెక్టు ఎంచుకొని హిట్ కొట్టారు అల్లరి నరేష్. నాంది చిత్రానికి, అందులోని నరేష్ నటనకు ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కాగా నాంది పాజిటివ్ టాక్ తెచ్చుకోగా అల్లరి నరేష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. సుడిగాడు మూవీ 2012లో విడుదలైంది.. అంటే ఎనిమిదేళ్లు అవుతుంది. మరో హిట్ కొట్టడానికి నాకు ఎనిమిదేళ్లు పట్టిందని నరేశ్ ఎమోషనల్ అయ్యారు. 


నాంది చిత్రాన్ని నిర్మించిన దర్శక నిర్మాతలకు, ఆదరిస్తున్న ప్రేక్షకులను నరేష్ ధన్యవాదాలు తెలిపారు. కాగా నాంది చిత్రానికి ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐ ఎం డి బి అత్యధిక రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఐ ఎం డి బి ఏకంగా ఈ చిత్రానికి 9.9 ఇవ్వడం గమనార్హం. ఈ స్థాయిలో రేటింగ్ తెచ్చుకున్న తెలుగు చిత్రం ఈ మధ్య కాలంలో విడుదల కాలేదు. 


దర్శకుడు విజయ్ కనకమేడల చట్టంలోని లొసుగులు, కొన్ని సెక్షన్స్ కారణంగా అమాయకులు ఎలా బలవుతున్నారు. అంగబలం, అర్థబలం ఉన్నవారు ఎలా చట్టాన్ని తమ అనుకూలంగా మలుచుకొని, చేసిన తప్పుల నుండి తప్పించుకు తిరుగుతున్నారనే విషయాలు చక్కగా తెరకెక్కించారు. నాంది చిత్రాన్ని సతీష్ వేగేశ్న తెరకెక్కించగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక రోల్ చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios