Asianet News TeluguAsianet News Telugu

‘గంగూబాయ్’ గా రామ్ చరణ్ హీరోయిన్

లాస్ట్ ఇయిర్ ‘పద్మావత్’ సినిమాతో హిట్ కొట్టిన  భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే టైటిల్ తో ఒక సినిమా మొదలెట్టారు.  అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా కు బ్రేక్ పడింది. 

Alia Bhatt to do 'Gangubai
Author
Hyderabad, First Published Sep 22, 2019, 1:41 PM IST

లాస్ట్ ఇయిర్ ‘పద్మావత్’ సినిమాతో హిట్ కొట్టిన  భన్సాలీ...తాజాగా సల్మాన్ ఖాన్,ఆలియాభట్‌‌లతో ‘ఇన్‌షా అల్లా’ అనే టైటిల్ తో ఒక సినిమా మొదలెట్టారు.  అయితే అనుకోని కారణాలతో ఆ సినిమా కు బ్రేక్ పడింది. దాంతో  సంజయ్ లీలా భన్సాలీ..మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. ముంబాయికి చెందిన రౌడీరాణి గా పేరు పడ్డ గుంగూబాయి కోఠేవాలి జీవిత కథ ఆధారంగా సినిమాను తెరకెక్కించేందకు సంజయ్ లీలా భన్సాలీ రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాను ముంబాయిలోని కామటిపుర అనే రెడ్ లైట్ ఏరియా బ్యాక్ డ్రాప్‌లో  తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమాలోనూ అలియా భట్ నే  ప్రధాన పాత్రకు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.  అంటే అలియా.. వేశ్యావాటిక నిర్వాహకురాలు గుంగూబాయిగా కనిపించబోతుంది.  ఇక ఈ సినిమా మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై అనే నవల ఆధారంగా రూపొందుతోంది. ప్రస్తుతం అలియా భట్ ...ఆర్ ఆర్ ఆర్ లో హీరోయిన్ గా కనిపించబోతోంది. రామ్ చరణ్ కు జోడీగా ఆమె చేస్తోంది.  

 అలియా కొన్నాళ్ళుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే.  కాగా, స‌ల్మాన్ ద‌బాంగ్ 3, కిక్ 2 చిత్రాలతోను బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే . ఇక అలియా ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్రా చిత్రంతో పాటు క‌ళంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయ‌ర్ 2, ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios