బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ ఇటీవల స్టార్ హీరోయిన్ అలియా భట్, అమీర్ ఖాన్ ల మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఏదైనా సినిమా నచ్చితే తన ప్రోత్సాహం అందిస్తుంటానని కానీ తన విషయంలో మాత్రం ఎవరూ అలా ప్రవర్తించరని కామెంట్స్ చేసింది.

ఈ క్రమంలో అలియా భట్ ని టార్గెట్ చేస్తూ.. 'రాజీ' సినిమా ట్రైలర్ చూసి అలియా, దర్శకురాలు మేఘనాలతో అరగంట సేపు మాట్లాడినట్లు కంగనా చెప్పింది. బహిరంగంగా  ప్రశంసించినట్లు చెప్పుకొచ్చింది.

కానీ తన సినిమా ప్రీమియర్ షోకి మాత్రం ఎవరూ రాలేదని అవసరం ఉంటే బాగా మాట్లాడతారని లేదంటే పట్టించుకోరని వెల్లడించింది. ఈ విషయంపై మీడియాఅలియా భట్ ని ప్రశ్నించింది.

దీనిపై స్పందించిన ఆమె.. ''కంగనా నాకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒక వ్యక్తిగా నటిగా ఆమె అంటే నాకు ఎప్పుడూ ఇష్టం. మనసులో ఉన్న విషయాన్ని ఆమె ధైర్యంగా  వెల్లడించగలదు. నా విషయంలో ఆమెకి తలెత్తిన ఇబ్బంది ఏమిటో తెలుసుకుంటా.. ప్రస్తుతం షూటింగ్ తో బిజీగా ఉన్నా.. కంగనాను వ్యక్తిగతంగా కలిసి సారీ చెబుతా'' అంటూ చెప్పుకొచ్చింది.