Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బాస్ హౌస్ లోకి అలియా భట్, రణబీర్.. నాగార్జునతో కలసి సందడి, బ్రహ్మాస్త్రం నెక్స్ట్ లెవల్ ప్రమోషన్స్

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ రణబీర్ కపూర్, అలీ భట్ జంటగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్రం. సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది.

Alia Bhatt and Ranbir kapoor will appear in Bigg Boss 6Telugu
Author
First Published Sep 4, 2022, 9:44 AM IST

బాలీవుడ్ క్రేజీ కపుల్స్ రణబీర్ కపూర్, అలీ భట్ జంటగా నటిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్రం. సూపర్ హీరో మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై క్రమంగా బజ్ పెరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా దక్షణాది భాషల్లో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ఈ చిత్రానికి రాజమౌళి ప్రజెంటర్ గా వ్యవహారిస్తున్నారు. దీనితో జక్కన్న ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తన మాస్టర్ మైండ్ ఉపయోగిస్తున్నారు. 

సినిమాపై బజ్ పెంచేందుకు హిందీతో పోటీగా తెలుగులో కూడా ప్రమోషన్స్ జరుగుతున్నాయి. వరుస ప్రెస్ మీట్స్ చూశాం. అలియా, రణబీర్ ని యాంకర్ సుమ క్యాష్ ప్రోగ్రాంలోకి కూడా తీసుకెళ్లాడు జక్కన్న. త్వరలో అలియా భట్, రణబీర్ బిగ్ బాస్ తెలుగు 6 సీజన్ లో సందడి చేయబోతున్నారు. మరోసారి నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 6 నేడు ప్రారంభం కానుంది. 

ఓ స్పెషల్ ఎపిసోడ్ లో అలియా, రణబీర్.. నాగార్జునతో కలసి సందడి చేయనున్నారట. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ 3న ముగిసినట్లు తెలుస్తోంది. నాగార్జున కూడా బ్రహ్మాస్త్రం చిత్రంలో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ముగ్గురూ కలసి బిగ్ బాస్ వేదికపై కనిపిస్తే సినిమాకి కావలసినంత పబ్లిసిటీ వస్తుంది. 

బ్రహ్మాస్త్రం చిత్రంలో రణబీర్ అగ్నిని కంట్రోల్ చేయగలిగే సూపర్ హీరోగా నటిస్తున్నాడు. పురాణాల్లో బ్రహ్మాస్త్రం గురించి చెబుతుంటారు. అన్ని అస్త్రాలలోకి బ్రహ్మాస్త్రం ఎంతో శక్తివంతమైనది. ఆ బ్రహ్మాస్త్రం దుష్టశక్తుల వశం కాకుండా రణబీర్ ఎలాంటి పోరాటం చేశాడు అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. బిగ్ బి అమితాబ్ కూడా కీలక పాత్రలో నటించారు. 

కొంత కాలంగా బాలీవుడ్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద నిరాశే ఎదురవుతోంది. భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న బ్రహ్మాస్త్ర చిత్రం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి. అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకుడు. 

Follow Us:
Download App:
  • android
  • ios