Asianet News TeluguAsianet News Telugu

అలీకి వచ్చిన ఆఫర్ చూసి అంతా ఆశ్చర్యం

బాల నటుడు నుంచి స్టార్ కమిడియన్ , హీరోగా ఎదిగి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యారు అలీ. 

Ali roped in Salman Khan's Dabangg 3
Author
Hyderabad, First Published Apr 21, 2019, 10:37 AM IST

బాల నటుడు నుంచి స్టార్ కమిడియన్ , హీరోగా ఎదిగి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా సెటిలయ్యారు అలీ. రీసెంట్ గా రాజకీయాల్లోకి వచ్చి రచ్చ రచ్చ చేసారు. పవన్ కళ్యాణ్ ని ఎదురు ప్రశ్నించి మెగాభిమానుల ఆగ్రహానికి గురి అయ్యారు. మెగా క్యాంప్,సపోర్టర్స్  కూడా ఇక అలీ ని దూరం పెడుతారేమో అనుకున్న స్దితిలో అలీ ...భారీ ఎత్తున నిర్మిస్తున్న ఓ  బాలీవుడ్ చిత్రంలో కనపడి షాక్ ఇచ్చారు.   అలీ ఏకంగా 'దబాంగ్ 3' సినిమాలో అవకాశాన్ని దక్కించుకున్నాడు.

స‌ల్మాన్ ప్ర‌స్తుతం సూప‌ర్ హిట్ సిరీస్ ద‌బాంగ్‌లో భాగంగా ద‌బాంగ్ 3 చిత్రం చేస్తున్నాడు. ప్ర‌భుదేవా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా హీరోయిన్ గా న‌టిస్తుంది. సుదీప్ విల‌న్‌గా కనిపించ‌నున్నాడు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో అలీకి అవ‌కాశం రావ‌డం  చాలా గొప్ప విష‌య‌ం. దాంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే తెలుగు మార్కెట్ కోసం సల్మాన్ ఖాన్ , ప్రభుదేవా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   ఈ సినిమాలో కానిస్టేబుల్ పాత్ర‌లో అలీ సంద‌డి చేయ‌నున్నాడు. 

దబాంగ్ రీమేక్ గబ్బర్ సింగ్ లో అలీ చేసిన కానిస్టేబుల్ పాత్ర నచ్చే ఈ క్యారక్టర్ ఇచ్చారంటోంటి టీమ్.   ఇటీవలే ఈ సినిమా షూటింగు మొదలైంది. ఆ సమయంలోనే ఈ సినిమా సెట్ లో సల్మాన్ తో కలిసి తన ఫ్యామిలీతో అలీ ఫొటో దిగాడు.  ఇందులో అలీ ఫ్యామిలీ కూడా ఉన్నారు . ఈ చిత్రం త‌ర్వాత అలీకి బాలీవుడ్‌లోను మరిన్ని ఆఫ‌ర్స్ వ‌స్తాయ‌ని అంటున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios