నాని హీరోగా చేసిన అలా మొదలైంది చిత్రం. అలా మొదలైంది కూడా థియేటర్లలోకి రాబోతుంది. న్యాచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 


రీరిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో హిట్ అయిన బ్లాక్ బస్టర్ సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నారు. ఇప్ప‌టికే ఒక్కడు, జల్సా, ఖుషి, పోకిరి, బాద్ షా, గ్యాంగ్ లీడర్, వర్షం సినిమాలున్నాయి. ఇటీవల ఈ సినిమాలు 4కె వెర్షన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీగా వసూళ్లు రాబట్టాయి. ఫ్యాన్స్ సైతం బాగానే చూస్తున్నారు. ఇలా రీ రిలీజ్ చేసిన మూవీలతో బిజినెస్ బాగానే జరుగుతోందంటున్నారు ఎగ్జిబిటర్స్. వాస్తవానకి కొత్త సినిమా కంటే.. మళ్లీ విడుదల చేసిన పాత సినిమాల దగ్గర ఎంజాయ్ చేస్తున్నారు. డైలాగ్స్ వర్డ్ టూ వర్డ్ చెబుతూ.. తమ అభిమాన హీరోపై ప్రేమను చూపించటం ఇక్కడ ప్రత్యేకత. 

అలాగే ఈ రీరిలీజ్ లకు ప్రత్యేకమన పబ్లిసిటీ అక్కర్లేదు. సోషల్ మీడియా(Social Media)లో అభిమానులు హంగామాతో పబ్లిసిటీ జరుగుతోంది. ఈ రీ రిలీజ్ లకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ హిట్ చిత్రాలైన ప‌వ‌న్ క‌ల్యాణ్(Pawan Kalyan) ఖుషి, మ‌హేష్‌బాబు ఒక్కడు కూడా రీ రిలీజ్ అయ్యాయి. తాజాగా ఈ వారం మరో రెండు చిత్రాలు రీ రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. అవేమిటంటే..

ఒకటి నాని హీరోగా చేసిన అలా మొదలైంది చిత్రం. అలా మొదలైంది కూడా థియేటర్లలోకి రాబోతుంది. న్యాచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ జంటగా నటించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నాని.. నిత్యా కెమిస్ట్రీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా మరోసారి ఆడియన్స్ ముందుకు రాబోతుంది. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ఫిబ్రవరి 24నల ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చేయబోతున్నారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఇప్పటికీ మూవీ లవర్స్ కు ఆల్ టైమ్ ఫేవరెట్. సినిమానే కాదు.. ఇందులోని సాంగ్స్ సైతం శ్రోతలను ఆకట్టుకున్నాయి. ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నిత్యా.. గాయనిగానూ మెప్పించింది. ఈ సినిమాకు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందించాగా.. రెండు నంది అవార్డులు గెలుచుకుంది. మ‌రి ఈ చిత్రం ఏ మేర‌కు నేటి ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

ర‌వితేజ హీరోగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మిర‌ప‌కాయ్ సినిమా జ‌న‌వ‌రి 26న రీ రిలీజ్ కానుంది. ర‌వితేజ బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య బ్యాక్ టూ బ్యాక్ స‌క్సెస్‌ల‌తో ర‌వితేజ జోరుమీదున్నాడు. ఆ క్రేజ్ మిర‌ప‌కాయ్ రీ రిలీజ్ కూడా క‌లిసివ‌స్తోంద‌ని నిర్మాత‌లు భావిస్తోన్నారు. పెద్ద ఎత్తున ఈ సినిమాను రీ రిలీజ్ చేయ‌నున్న‌ట్లు స‌మాచారం.

యాక్ష‌న్ కామెడీ క‌థాంశంతో రూపొందిన మిర‌ప‌కాయ్ 2011లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఇందులో ర‌వితేజ కామెడీ టైమింగ్‌, మాస్ అంశాలు ప్రేక్ష‌కుల్ని మెప్పించాయి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా 113 సెంట‌ర్స్‌లో యాభై రోజులు ఆడింది. ఇందులో రిచా గంగోపాధ్యాయ‌, దీక్షా సేథ్ హీరోయిన్లుగా న‌టించారు. ప్ర‌కాష్ రాజ్ విల‌న్‌గా క‌నిపించారు. మిర‌ప‌కాయ్ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు.