బాలీవుడ్ స్టార్ హీరో  అక్షయ్ కుమార్(Akshaya Kumar)  కు అరుదైన గౌరవం దక్కింది . ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ టాప్ హీరోలలో ముందు వరసలో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రం ఆయన్ను ప్రత్యేకంగ గౌరవించింది.

బాలీవుడ్ స్టార్ హీరో  అక్షయ్ కుమార్(Akshaya Kumar) కు అరుదైన గౌరవం దక్కింది . ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ టాప్ హీరోలలో ముందు వరసలో ఉన్నారు. ఇక ఉత్తరాఖండ్(Uttarakhand) రాష్ట్రం ఆయన్ను ప్రత్యేకంగ గౌరవించింది.

అక్షయ్ కుమార్ (Akshaya Kumar) సినిమా ప్రియులకు పరచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ ఆడియన్స్ కు ఆరాధ్య హీరో..స్టార్ డమ్ లో.. సంపాదనలో ఇతర హీరోలకంటే ముందే ఉన్నాడు అక్షయ్(Akshaya Kumar).. బాలీవుడ్ లో మొదటి 100 కోట్ల హీరో అక్షయ్ కుమారే. ఇమేజ్ లో పాలోయింగ్ లో అక్షయ్ కుమార్ ను మించిన హీరోలు ఉన్నా.. అక్షయ్ కుమార్ కు ఉన్న డిమాండ్ మాత్రం వేరు.

ఇప్పటికే అక్షయ్ కుమార్(Akshaya Kumar) కు చాలా గౌరవాలు దక్కాయి. ఇక కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ఆయకు భారీ సత్కారం లభించింది. ఆ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ కుమార్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ వెల్లడించారు.

Scroll to load tweet…

సోమవారం ఉత్తరాఖండ్(Uttarakhand) రాజధాని డెహ్రాడూన్ లోని సీఎం నివాసానికి అక్షయ్ కుమార్(Akshaya Kumar) వెళ్లారు.ఈ సందర్భంగానే ఆ రాష్ట్ర సీఎం ఈ కీలక ప్రకటన చేశారు. ఉత్తరాఖండ్ బ్రాండ్ అంబాసడర్ గా అక్షయ్ పని చేస్తారని ఆయన చెప్పారు. బ్రాండ్ అంబాసడర్ గా ఉండాలని తాము అక్షయ్ ని కోరామని... తమ ప్రతిపాదనకు ఆయన అంగీకరించారని తెలిపారు.
మరోవైపు ఉత్తరాఖండ్ (Uttarakhand) అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి సీఎంకు అక్షయ్ కుమార్ గుడ్ లక్ చెప్పారు. అక్షయ్ కుమార్(Akshaya Kumar) ప్రస్తుతం సినిమా షూటింగ్ కోసం ఉత్తరాఖండ్ లో ఉన్నారు.అక్కడే మరికొన్ని రోజులు షూటింగ్ చేసుకోనున్నరు. ఇక ఈ సమావేశం సందర్భంగా అక్షయ్(Akshaya Kumar) కు ఉత్తరాఖండ్ (Uttarakhand) ట్రెడిషనల్ టోపీని, మెమెంటోను సీఎం బహూకరించారు.