కమల్ హాసన్ రెండో కూతురు తన గుండె పగిలిపోయిందంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఆమె ట్వీట్ వైరల్ అవుతోంది. మొదట సినిమాలలో తెర వెనుక పని చేయాలని భావించిన అక్షర హాసన్.. హిందీ సినిమా షమితాబ్ ద్వారా నటిగా మారింది.

ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా ఆమె కెరీర్ కి ఏదీ పెద్దగా కలిసిరాలేదు. దీంతో తన తండ్రి నటిస్తోన్న 'శభాష్ నాయుడు' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టింది. కానీ ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది.

కొద్దిరోజులుగా ఆమె సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. తాజాగా ఆమె ప్రైవేట్ ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమెని సంప్రదించే ప్రయతం చేయగా.. స్పందించలేదు. అయితే తన గుండె పగిలిపోయిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ మాత్రం పెట్టింది.

ఇంతకీ ఆమె ఇలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందంటే.. ఇటీవల ఆమె హాలీవుడ్ ఫిలిం 'లోగన్' ని చూసిందట. ఈ సినిమా చివరి పార్ట్ లో హీరో వోల్వేరియన్ చనిపోతాడు. ఆ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేక ఆమె గుండె బద్దలైపోయిందే అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.  

ఇది కూడా చదవండి.. 

కమల్ ఫ్యామిలీ షాక్: అక్షరహాసన్ ప్రెవేట్ ఫొటోలు లీక్‌!