టాలీవుడ్ పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతుంది. ఇక్కడి హీరోలు.. ఇక్కడి దర్శకులకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరిగిపోయింది. బాలీవుడ్ నుంచి స్టార్ డైరెక్టర్లు కూడా ఇక్కడి హీరోల తో సినిమా చేయడానికి ఆరాటపడుతున్నారు. ఇక రీసెంట్ గా బాలీవుడ్  స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ.. అక్కినేని హీరోతో సినిమాకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.   

మన తెలుగు హీరోల కోసం.. దర్శకుల కోసం.. బాలీవుడ్ నుంచి మేకర్స్ ఎదురు చూస్తున్నారు. మనవారితో సినిమాల చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే హీరోలలో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్,బన్ని, విజయ్ దేవరకొండ.. ఇలా స్టార్ హీరోలంతా బాలీవుడ్ లో ఫేమస్ అయ్యారు. అక్కడ కూడా ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు. డైరెక్టర్లలో రామ్ గోపాల్ వర్మ, సందీప్ వంగా.. గౌతమ్ తిన్ననూరి లాంటి వారు ఫేమస్ అయ్యారు. ఇక ఇప్పటికీ మన స్టార్స్ కోసంఅక్కడి స్టార్ డైరెక్టర్లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక అసలు విషయం చూస్తే.. భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో ఒకరైనా సంజ‌య్ లీలా భ‌న్సాలీ అక్కినేని హీరో నాగచైతన్యతో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ.. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌తో చేతులు క‌లుప‌నున్న‌ట్లు తెలుస్తుంది. తాజాగా చైత‌న్య‌, సంజ‌య్ భ‌న్సాలీని క‌లిశాడ‌ట‌. వీరిద్ద‌రి క‌లియ‌క‌లో ఓ మూవీ కోసం చ‌ర్చ‌లు జ‌రిగినట్లు బాలీవుడ్ వ‌ర్గాల సమాచారం. అయితే గతంలో పుష్ప రిలీజ్ తరువాత.. బన్నీ కూడా సంజయ్ ను కలిశారు. వీరిద్దరు సినిమా చేయబోతున్నారని అనుకున్నారు. కాని ఇంత వరకూ అనౌన్స్ మెంట్ లేదు. ఇందులో నిజ‌మెంతుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

ప్రస్తుతం నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమా లాల్ సింగ్ చ‌డ్డా ఆగ‌స్టు 12న విడుద‌ల కానుంది. ఆమీర్ ఖాన్ హీరోగా, కరీనా కపూర్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవ ిస్పాన్సర్ చేస్తున్నాడు దీనితో పాటుగా నాగ చైత‌న్య‌, విక్ర‌మ్ కుమార్‌ ద‌ర్శ‌క‌త్వంలో ధూత అనే హార్ర‌ర్ వెబ్ సిరీస్‌ను చేస్తున్నాడు. ఈ వెంటనే.. మానాడు ఫేం వెంక‌ట్ ప్ర‌భూ డైరెక్షన్ లో మూవీ చేయబోతున్నాడు యంగ్ హీరో. 

వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీద ఉన్న నాగచైతన్య.. గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తూ..మంచి జోరుమీదున్నాడు. అయితే నాగ‌చైత‌న్య స్పీడ్‌కు ఈ మధ్యే థాంక్యూ మూవీ బ్రేక్‌లు వేసింది. భారీ అంచ‌నాల‌తో జూలై 22న విడుద‌లైన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. దాంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఫేయిల్యూర్‌గా మిగిలింది. ఇదిలా ఉంటే 

నిజ జీవిత కథలను అందమైన చిత్రాలుగా మలిచి.. అందంగా, అంద‌రికి అర్థ‌మ‌య్యేట్టుగా తెర‌పై చూపించ‌డంలో సంజ‌య్ లీలా భ‌న్సాలీ సిద్ద హ‌స్తుడు. సంజయ్ సినిమాల్లో టేకింగ్ , విజువ‌లైజేష‌న్ అద్భుతంగా ఉంటాయి.. ఆడియన్స్ కు ఒక కొత్త అనుభూతిని క‌లిగిస్తాయి. ఇక బాలీవుడ్‌లో బయోపికిక్స చేయాలన్నా.. పిరీయాడిక్ మూవీస్ చేయాలన్నీ బన్సాలీకి మాత్రమే సాధ్యం. రీసెంట్ గా ఆయన చేసిన గంగుబాయి క‌తియావాడి మంచి విజ‌యాన్ని సాధించడంతో పాటు .. బాలీవుడ్ కు చాలా కాలం తరువాత మంచి హట్ కూడా వచ్చింది. ఇక ఈ మూవీపై వస్తున్న రూమర్స్ ఎంత వరకూ నిజమో తెలియాలంటే.... అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చే వరకూ ఆగాల్సిందే.