Asianet News TeluguAsianet News Telugu

Akil Akkineni : నాన్నకు కొడుకుగా.. అన్నకి తమ్ముడిగా పుట్టడం గర్వంగా ఉంది.. అఖిల్ అక్కినేని ట్వీట్

అక్కినేని వారసుడు, కింగ్ నాగర్జున రెండో కొడుకు, హీరో అఖిల్ తన తండ్రి, తన అన్న పట్ల ఎమోషనల్ గా ఫీల్ అవుతూ ట్వీట్ చేశాడు. అయితే ఇటీవల బంగార్రాజు మూవీలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించి, ఈ సంక్రాంతికి విజయవంతంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే సినిమా హిట్ కావడంతో అఖిల్ తన ట్విట్టర్ తో కొంత ఎమోషనల్ గా స్పందించారు. 
 

Akil Akkineni Emotional Tweet, Social Media Post.
Author
Hyderabad, First Published Jan 17, 2022, 4:59 PM IST

బంగార్రాజు మూవీ ప్రస్తుతం కలెక్షన్ల పండగను తెచ్చింది. సంక్రాంతికి సినిమా బాగా వర్కౌట్ అయ్యింది. సంక్రాంతికి సాధించేశాడు బంగార్రాజు. వాసివాడి తస్సదియ్యా.. అంటూ అభిమానులు కాలర్ ఎగరేస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా 14న రిలీజ్ అయిన సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ తో సత్తా చూపించింది. ఒక్కరోజే రూ. 17 కోట్లు వసూల్ చేసి వారేవ్వా బంగార్రాజు  అనిపించిందీ మూవీ. 

సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బంగార్రాజు’మూవీ తాజాగా  రూ.53 కోట్లకు పైగా కలెక్షన్ల వర్షం కురిపించింది. కేవలం మూడు రోజుల్లో ఇంత పెద్ద మొత్తంలో కలెక్షన్స్ రావడంతో చిత్ర నిర్మాతలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కలెక్షన్ కింగ్ లో బంగార్రాజు ఉండటం పట్ల సంతోషపడుతున్నారు. 

అయితే పండుగ  సందర్భంగా  రిలీజైన బంగార్రాజు మూవీ  కలెక్షన్ల మోత మోగిస్తుండటం పట్ల అఖిల్ తన తండ్రి నాగార్జున, అన్న నాగ చైతన్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అఖిల్. ‘ఒక కొడుకుగా, ఒక తమ్ముడిగా చాలా గర్వ పడుతున్నాను. సంక్రాంతి పండుగ మీదే. బంగార్రాజు మూవీ టీమ్ కు నా శుభాకాంక్షలు.  మళ్లీ బ్లాక్ బస్టర్ మూవీ  ఇచ్చినందుకు  మా డైరెక్టర్ కే కళ్యాణ్ క్రిష్ణకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు. 

 

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna)  గతంలో చేసిన సొగ్గాడే చిన్నినాయనా సినిమా.. ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అదే తరహాలో బంగార్రాజు సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన కే కళ్యాణ్ క్రిష్ణ తన ప్రతిభతో మూడు నుంచి నాలుగు నెలల్లో సినిమా షూటింగ్  పూర్తి చేశారు. 

పెద్ద సినిమాలన్నీ సంక్రాంతి బరిలో నిలుస్తాయనుకుంటే ఒక్కొక్కటి తప్పుకోవడంతో బంగర్రాజు మూవీకి మరీ ప్లస్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా  డైరెక్టర్ కళ్యాణ్ క్రిష్ణ చిత్రీకరించడంతో సంక్రాంతి పండుగ మొత్తం థియేటర్లలోనే కనిపించింది. అక్కినేని ఫ్యామిలీకి   డైరెక్టర్ కళ్యాణ్ గతంలో సోగ్గాడే చిన్ని నాయన సినిమా తీసి పెద్ద హిట్ అందించారు.   

కాగా, అఖిల్ అక్కినేని రీసెంట్ మూవీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ కొట్టి తన కళను సాకారం చేసుకున్నాడు. గతంలో తీసిన నాలుగు సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో కొంత నిరాశ చెందిన అఖిల్, డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో తన కేరీర్ ను పట్టాలపైకి ఎక్కించాడు. ఈ సంక్రాంతితో అక్కినేని వారింట సినిమాల పంట అన్నట్టుగా ఉందని అభిమానులు అంటున్నారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios