Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ సినిమాకు ముందస్తు జాగ్రత్తలు!

అక్కినేని యువ హీరో అఖిల్ నాలుగవ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ ఊపందుకుంటున్నాయి. ఈ నెల 24వ సినిమా లాంచ్ ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు అపజయాలను ఎదుర్కొన్న అఖిల్ ఈ సినిమా ద్వారా ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. 

akhil upcoming movie update
Author
Hyderabad, First Published May 21, 2019, 7:54 AM IST

అక్కినేని యువ హీరో అఖిల్ నాలుగవ సినిమా ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ ఊపందుకుంటున్నాయి. ఈ నెల 24వ సినిమా లాంచ్ ప్రోగ్రామ్ ని ఫిక్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. వరుసగా మూడు అపజయాలను ఎదుర్కొన్న అఖిల్ ఈ సినిమా ద్వారా ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్ అందుకోవాలని కష్టపడుతున్నాడు. 

నటనలో మరిన్ని మెళకువలు నేర్చుకున్న అఖిల్ నెక్స్ట్ సినిమాలో సరికొత్తగా కనిపించేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇక దర్శకుడు భాస్కర్ కి ఇది చాలా ఏళ్ల తరువాత వచ్చిన బంపర్ అఫర్ అని చెప్పవచ్చు. బొమ్మరిల్లు - పరుగు వంటి సినిమాల అనంతరం సరైన హిట్ అందుకొని భాస్కర్ ఈ గోల్డెన్ ఛాన్స్ ద్వారా మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని అనుకుంటున్నాడు. 

ఇక సినిమాకు సంగీతం అందించనున్న గోపి సుందర్ తో దర్శకుడు స్పెషల్ గా ముందే మ్యూజిక్ పనులను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. భాస్కర్ గత సినిమాల రిజల్ట్ తేడా కొట్టినప్పటికీ అన్ని సినిమాల్లో మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఇప్పుడు అఖిల్ నాలుగవ సినిమాలో మ్యూజిక్ చాలా అవసరమని గోపి సుందర్ తో డైలీ సిట్టింగ్ వేస్తున్నారట. 

ఇప్పటికే రెండు ట్యూన్స్ ని కూడా ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. సినిమాలో ఎమోషన్ హెవీ గా ఉండటంతో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ముఖ్యమని తెలుస్తోంది. అందుకే దర్శకుడు ముందుగానే కథకు తగ్గట్టుగా మ్యూజిక్ ని సెట్ చేయించుకుంటున్నాడట. మరి ఈ ముందస్తు జాగ్రత్తలు అఖిల్ - భాస్కర్ కి ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.  

Follow Us:
Download App:
  • android
  • ios