Asianet News TeluguAsianet News Telugu

అఖిల్ తో ప్రభాస్.. ఫిక్స్ అయినట్లే!

అక్కినేని అఖిల్.. ప్రభాస్ తో కలిసి పని చేయనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ అంటే మన హీరో కాదు.. దర్శకుడి పేరు ప్రభాస్.

akhil to work with sathya prabhas pinishetty
Author
Hyderabad, First Published Feb 6, 2019, 11:52 AM IST

అక్కినేని అఖిల్.. ప్రభాస్ తో కలిసి పని చేయనున్నాడా..? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ అంటే మన హీరో కాదు.. దర్శకుడి పేరు ప్రభాస్. 'మలుపు' అనే చిత్రంతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైన దర్శకుడు సత్య ప్రభాస్ పినిశెట్టితో ఇప్పుడు సినిమా చేయాలని అనుకుంటున్నాడు అఖిల్.

ఇప్పటివరకు అఖిల్ నటించిన మూడు సినిమాలు అతడికి సరైన సక్సెస్ ని ఇవ్వలేకపోయాయి. ఇటీవల విడుదలైన 'మిస్టర్ మజ్ను' సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చినా.. బయ్యర్లకు మాత్రం నష్టాలు తప్పడం లేదు.

కానీ అఖిల్ మాత్రం తన రెండు సినిమాల కంటే ఇది చాలా బెటర్ అని ప్రమోట్ చేసుకుంటున్నాడు. తన తదుపరి సినిమా విషయంలో మాత్రం ఈ యంగ్ హీరో ఆచితూచి  అడుగులు వేస్తున్నాడు.

'మిస్టర్ మజ్ను' సినిమా ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడే సత్య ప్రభాస్ పినిశెట్టి.. అఖిల్ ని కలిసి కథ వినిపించాడు. అఖిల్ కి కూడా కథ నచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మార్చిలో ఈ సినిమా మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios