Asianet News TeluguAsianet News Telugu

అక్కినేని కిక్: నాగ్ సినిమాలో అఖిల్ కీ రోల్

 

అవును...ఇప్పుడు ప్యామిలీ ప్యాకేజ్ లు నడుస్తున్నాయి. తమ సినిమాల్లో తమ కుటుంబ హీరోలను చూపటానికి స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరో ఫ్యామిలీ అంతా తెరపై కనపడితే పండుగ చేసుకోవటానికి రెడీగా ఉంటారు. అందుకే ఇప్పుడు నాగార్జున తన తాజా చిత్రంలో అఖిల్ ని కీ రోల్ లో కనపడేందుకు ఒప్పించాడంటున్నారు

Akhil Akkineni in his father Nag's Bangarraju?
Author
Hyderabad, First Published Apr 5, 2019, 6:30 PM IST

అవును...ఇప్పుడు ప్యామిలీ ప్యాకేజ్ లు నడుస్తున్నాయి. తమ సినిమాల్లో తమ కుటుంబ హీరోలను చూపటానికి స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. ప్రేక్షకులు సైతం తమ అభిమాన హీరో ఫ్యామిలీ అంతా తెరపై కనపడితే పండుగ చేసుకోవటానికి రెడీగా ఉంటారు. అందుకే ఇప్పుడు నాగార్జున తన తాజా చిత్రంలో అఖిల్ ని కీ రోల్ లో కనపడేందుకు ఒప్పించాడంటున్నారు. 

వాస్తవానికి నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి ఓ సినిమా చేద్దామనుకున్నారట. అయితే అందుకు చాలా టైమ్ పట్టేటట్లు ఉంది. దాంతో ఒకరి సినిమాలో మరొకరు కనపడే ప్రయత్నాల ఇలా చేస్తున్నారన్నమాట. ఇంతకీ అఖిల్ కనపడే సినిమా ఏమిటీ అంటే బంగార్రాజు.

నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో వచ్చిన 'సోగ్గాడే చిన్నినాయనా' ఎంత పెద్ద హిట్టో తెలిసిందే.   ఆ సినిమాలో బంగార్రాజుగా నాగ్ ప్రేక్షకులను దుమ్ము రేపారు. దీంతో ‘బంగార్రాజు’ అనే టైటిల్‌తోనే ఈ చిత్రానికి సీక్వెల్ చేయాలని ప్లాన్ చేసారు. చాలా కాలంగా స్క్రిప్ట్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని నాగ్ తన సొంత బ్యానర్‌లో ఎన్నికలు పూర్తి కాగానే లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమాలో నాగార్జున సరసన నయనతార హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. అలాగే ఈ సినిమాలో నాగచైతన్యను ఓ కీలకమైన పాత్రకు అనుకున్నారు. అయితే చైతూ వరస ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో...అఖిల్ ని ఒప్పించి సీన్ లోకి తీసుకొచ్చారని తెలుస్తోంది.

ఈ విషయమై ఇప్పటికే చిత్ర దర్శకుడు కల్యాణ్ కృష్ణ అఖిల్ ను సంప్రదించగా   గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నారనే టాక్ వినిపిస్తోంది. వచ్చే సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది.

Follow Us:
Download App:
  • android
  • ios