ఏజెంట్ మూవీని దాదాపు 80 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. కానీ పది శాతం పెట్టుబడిని కూడా ఈ చిత్రం రికవరీ చేయలేకపోయింది. ఫలితంగా నిర్మాతతో పాటు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లు కూడా దారుణంగా దెబ్బతిన్నారు. 

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం 'భోళా శంకర్'. వరుస ఫ్లాప్స్ లో ఉన్న మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత చిరు నటిస్తున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఆగష్టు 11న భోళా శంకర్ చిత్రం రిలీజ్ కానుండడంతో నెమ్మదిగా ప్రమోషన్స్ పెంచుతున్నారు. 

అయితే ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది అఖిల్ 'ఏజెంట్' తో తీవ్రంగా నష్టపోయిన అనిల్ సుంకర. ఏజెంట్ మూవీని దాదాపు 80 కోట్ల బడ్జెట్ లో నిర్మించారు. కానీ పది శాతం పెట్టుబడిని కూడా ఈ చిత్రం రికవరీ చేయలేకపోయింది. ఫలితంగా నిర్మాతతో పాటు ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన బయ్యర్లు కూడా దారుణంగా దెబ్బతిన్నారు. 

దీనితో బయ్యర్ల నుంచి అనిల్ సుంకరపై ఒత్తిడి ఉంది. ఆ భారం చిరంజీవి భోళా శంకర్ పై పడుతోందని వార్తలు వస్తున్నాయి. స్వల్పంగా నష్టాలు ఉంటే ఆ తర్వాతి చిత్రాన్ని తక్కువ ధరకి అమ్మి దిల్ రాజు లాంటి నిర్మాతలు సెటిల్ చేయడం చూస్తూనే ఉన్నాం. కానీ ఏజెంట్ మిగిల్చిన నష్టం అంతా ఇంతా కాదు. 

అయినప్పటికీ భోళా శంకర్ ద్వారా నష్టాలని పూడ్చే ప్రయత్నం చేస్తానని అనిల్ బయ్యర్లకు చెబుతున్నారట. దీని ప్రభావం భోళా శంకర్ ప్రీ రిలీజ్ పై పడుతుంది. మరి ఏజెంట్ బాధితులకు భోళా శంకరుడే దిక్కన్నమాట. 

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన అఖిల్ ఏజెంట్ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్ద హంగామానే చేసేటట్లు కనిపించింది. కానీ రిలీజ్ అయ్యాక సినిమాలో మ్యాటర్ ఏమాత్రం లేకపోవడంతో ఆఫ్టర్ నూన్ షోల నుంచే డిజాస్టర్ అని తేలిపోయింది. 

ఏజెంట్ నిర్మాత అనిల్ సుంకర తన ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భోళా శంకర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో కీర్తి సురేష్, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.