అక్కినేని వారసుడు అఖిల్ లేటెస్ట్ మూవీ ఏజెంట్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో అఖిల్ స్పై గా నటిస్తున్నట్లు సమాచారం. కాగా ఏజెంట్ మూవీ చిత్ర విడుదల తేదీ ఫిక్స్ చేశారు యూనిట్.
అఖిల్ (Akhil)ఆరంభం ఏం బాగోలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పసిప్రాయంలోనే సిసింద్రీ చిత్రంతో అఖిల్ అదరగొట్టాడు. అయితే హీరోగా ఆయనకు ఎంట్రీ నిరుత్సాహపరిచింది. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో అఖిల్ ని నాగార్జున లాంచ్ చేశారు. ;'అఖిల్' టైటిల్ తో తెరకెక్కిన అఖిల్ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తర్వాత అఖిల్ చేసిన హలో, మిస్టర్ మజ్ను వరుసగా పరాజయం పొందాయి. దీంతో అఖిల్ కెరీర్ సందిగ్ధంలో పడింది. స్టార్ కిడ్ కావడంతో పట్టు వదలకుండా బెటర్ ప్రాజెక్ట్ సెట్ చేశారు. బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ చెప్పిన కథకు ఇంప్రెస్ అయిన నాగార్జున మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రానికి పచ్చజెండా ఊపారు.
నిజానికి బొమ్మరిల్లు భాస్కర్ కూడా ఫార్మ్ లో లేడు. నాగార్జున కథకు మార్పులు చేర్పులు చేయించి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లారు. నాగార్జున తో పాటు అఖిల్ నమ్మకాన్ని నిజం చేస్తూ బొమ్మరిలు భాస్కర్ హిట్ కొట్టాడు. ఆయనకు కూడా ఈ మూవీ విజయం చాలా అవసరం. హీరోగా ఫస్ట్ హిట్ అందుకున్న అఖిల్.. తన తదుపరి మూవీలో మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నారు.
స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అఖిల్ తో మూవీ చేయడానికి ఒప్పుకున్నారు. ఏజెంట్ (Agent)టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆయన స్పై గా కనిపించనున్నారు. జేమ్స్ బాండ్ చిత్ర తరహాలో ఈ చిత్రాన్ని దర్శకుడు తీర్చిదిద్దుతున్నారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఏజెంట్ మూవీలో కీలక రోల్ చేయడం విశేషం. కాగా ఏజెంట్ మూవీ విడుదల తేదీని చిత్ర యూనిట్ ఫిక్స్ చేశారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగష్టు 12న ఏజెంట్ విడుదల కానుంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇక నాగ్ తన కుమారుల్లో ఒకరినైనా మాస్ హీరోగా తీర్చిదిద్దాలని ట్రై చేస్తున్నారు. పెద్ద కొడుకు నాగ చైతన్య హీరోగా మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. అయితే స్టార్ హీరో హోదా దక్కించుకోలేకున్నారు. మాస్ చిత్రాలు చేసిన ప్రతిసారి చైతూ ప్రతికూల ఫలితం అందుకున్నారు. దీనితో ఆయన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్స్ నే చేస్తున్నారు. కనీసం అఖిల్ మాస్ హీరో ఇమేజ్ తో స్టార్ కావాలని నాగార్జున ఆశిస్తున్నారు. ఆయన కోరిక ఎంత వరకు నెరవేరనుందో... ఏజెంట్ మూవీ ఫలితం ద్వారా తెలుస్తుంది.