Asianet News TeluguAsianet News Telugu

Akhanda:“అఖండ” హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్మకం,షాకిచ్చే రేటుకి

భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబడుతోంది.  

Akhanda Hindi dubbing rights sold for Whopping Amount
Author
Hyderabad, First Published Dec 6, 2021, 10:06 AM IST

 బాలకృష్ణ, ప్రజ్ఞా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించిన అఖండ సినిమా (Akhanda Movie)గురించే మీడియా మొత్తం మాట్లాడుతోంది. ఈ సినిమా ఊహించని విధంగా బాక్సాఫీసును షేక్ చేస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా విదేశాల్లో కూడా అఖండ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎవరి నోట విన్నా అఖండ సూపర్ హిట్ అనే మాటే వినపడుతోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ అఖండ హాట్ టాపిక్ గా మారింది. బాలకృష్ణ చేసిన బెస్ట్ సినిమాల్లో అఖండ ఒకటని కామెంట్స్ చేస్తున్నారు. వర్డ్ ఆఫ్ మౌత్ తో అఖండ సినిమా చూసేందుకు సగటు ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం హిందీ డబ్బింగ్ రైట్స్ అమ్ముడయ్యాయని సమాచారం. 

 అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్‌ ఓ రేంజ్‌లో అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.
 
 రెండు వేరియేషన్ లో కూడా బాలయ్య లోని మాస్ విశ్వరూపం దేనికదే డిఫరెంట్ గా సాలిడ్ ట్రీట్ ని అందించింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లో కూడా ఈ సినిమా వసూళ్ల ప్రభంజనాన్ని సృష్టిస్తోంది.  ఇందులో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‏గా నటించగా.. విలన్ పాత్రలో శ్రీకాంత్ అదరగొట్టాడు. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించగా. థమన్ సంగీతం అందించారు.

ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన విడుదలైంది. థమన్ సంగీతం అందించారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఇక అఖండ పూర్తవ్వడంతో బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios