Asianet News TeluguAsianet News Telugu

డైరెక్ట్ ఓటిటి విడుదల గా “ఆకాశవాణి”,రిలీజ్ డేట్


 అదొక కారడవి. అందులో ఓ చిన్న గ్రామం. అమాయకులైన ఆ ఊరి జనం. వాళ్లు దేన్నో చూసి భయపడుతున్నారు. ఒకాయన ఇక్కడేదో తప్పు జరుగుతుందనీ చెబుతున్నాడు. ఇంతకీ అక్కడ ఏం జరుగుతోంది? ఎవరిని చూసి భయపడుతున్నారు ఆ ఊరి జనం? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ‘ఆకాశవాణి’ ప్రపంచాన్ని చూడాల్సిందే. 

Akashavani movie release on sony liv ott
Author
Hyderabad, First Published Sep 20, 2021, 11:06 AM IST


రాజమౌళి వద్ద అసెస్టెంగ్ గా పనిచేసిన అశ్విన్‌ గంగరాజు దర్శకత్వంలో తెరుకెక్కుతున్న సరికొత్త చిత్రం ‘ఆకాశవాణి’.ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ తో కూడిన కథతో రూపొందుతున్న ఈ సినిమాకి కీరవాణి తనయుడు కాలభైరవ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం టీజర్ విడుదలై మంచి కేజ్ తెచ్చుకుంది. వినయ్ వర్మ, తేజ కాకుమాను , ప్రశాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాని కరోనా ప్రభావంతో  విడుద‌ల వాయిదా వేశారు. ఇప్పుడు రిలీజ్ కు రెడీ చేసారు. అయితే ఓటీటిలో రిలీజ్ చేస్తున్నారు.

సోనీ లివ్‌ వేదికగా సెప్టెంబరు 24న స్ట్రీమింగ్‌ కానుంది.   డైరెక్ట్ ఓటిటి గా సోనీ లీవ్ లో సెప్టెంబర్ 24 వ తేదీన ప్రసారం కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.‘‘నిర్ణీత కాలం నేపథ్యంలో సాగే చిత్రమిది. ఓ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’’ అన్నారు. 

పద్మనాభరెడ్డి ఈ సినిమాని నిర్మిస్తుండగా బుర్రా సాయిమాధవ్‌ సంభాషణలు అందిస్తున్నారు.  చిత్రానికి సురేష్‌ రగుతు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తుండగా, జాతీయ అవార్డ్ గ్ర‌హీత శ్రీక‌ర్ ప్ర‌సాద్ ఎడిట‌ర్‌గా పనిచేస్తున్నారు.  ఏయూ అండ్ ఐ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై ఎ.పద్మనాభరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - 'మన కోన' పాట మంచి రెస్పాన్స్ వ‌చ్చాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios