నెగిటివ్ రోల్స్ తో టాలీవుడ్ ఆడియెన్స్ కి ఎక్కువగా దగ్గరైన నటుడు అజయ్ సరికొత్త లుక్ తో దర్శనమిచ్చాడు. కెరీర్ లో ప్రతిసారి ఒకే లుక్ తో కనిపించడం బోర్ కొట్టేసిందని అనుకున్నాడో ఏమో.. గాని కొత్త అవతారం ఎత్తాడు. చూస్తుంటే ఫ్యూచర్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చేలా ఉన్నడని అనిపిస్తోంది. 

ఇప్పటికే పలు సినిమాల్లో లీడ్ రోల్స్ లో కనిపించి మెప్పించిన సంగతి తెలిసిందే. బాడీ షేప్స్ ఈ రేంజ్ లో రావడానికి గత కొన్నాళ్లుగా అజయ్ తీరిక లేకుండా వర్కౌట్స్  చేస్తున్నాడట. ఆయన భార్య శ్వేత కూడా ఫిట్ నెస్ లో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫ్యాషన్ వరల్డ్ మోడల్ గా కూడా అజయ్ భార్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.