ప్రభాస్ నుండి రానున్న చిత్రాలు అన్నీ దేనికదే ప్రత్యేకం. వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ప్రభాస్ 21 మరియు  ఆదిపురుష్ చిత్రాలపై పరిశ్రమ వర్గాలలో అమితాసక్తి నెలకొని ఉంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ప్రభాస్ 21 గురించి ఇప్పటికే కొన్ని కీలక అప్డేట్స్ రావడం జరిగింది . ఈ మూవీలో హీరోయిన్ గా దీపికా పదుకొనెను తీసుకున్న చిత్ర యూనిట్, అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నట్లు ప్రకటించి సినిమాపై హైప్ మరింత పెంచేశారు. 

ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఆదిపురుష్ మూవీపై కూడా ఇదే స్థాయిలో అంచనాలున్నాయి. రామాయణ గాథగా నిర్మితం కానున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించనుండడం అనేది ఫ్యాన్స్ ని థ్రిల్ చేస్తున్న అంశం. కాగా ఆదిపురుష్ మూవీలో రావణుడిగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ని తీసుకోవడం జరిగింది. దీనిపై అధికారిక ప్రకటన కూడా చేశారు. 

ఐతే ఈ చిత్రం గురించి ఓ క్రేజీ న్యూస్ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఆదిపురుష్ లో బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్ ఓ కీలక రోల్ చేయనున్నాడట. ఆదిపురుష్ లో ఆయన శివుడు పాత్ర చేస్తున్నారని టాక్. దర్శకుడు ఓమ్ రౌత్ కి అజయ్ దేవ్ గణ్ సన్నిహితుడు కావడంతో ఈ పాత్రకు ఒప్పించాడని అంటున్నారు. ఈ ఏడాది విడుదలైన హిస్టారికల్ మూవీ తన్హాజి దర్శకుడు ఓం రౌత్ కాగా ఆ మూవీ హీరోగా అజయ్ దేవ్ గణ్ చేశారు. 

మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ పరిశ్రమలో చక్కర్లు కొడుతుంది. ఇక అజయ్ దేవ్ గణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ లో కీలక రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. భీమ్, అల్లూరిగా నటిస్తు ఎన్టీఆర్, చరణ్ లకు ఈయన గురువుగా కనిపిస్తారని సమాచారం. ఇక అజయ్ దేవ్ గణ్ కి  జంటగా శ్రీయా చరణ్ నటిస్తుంది. ఇటీవలే హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో ఆర్ ఆర్ ఆర్ షూట్ తిరిగి మొదలైన సంగతి తెలిసిందే.