Asianet News TeluguAsianet News Telugu

టాలీవుడ్ 'చీప్ స్టార్'.. ఎవరయ్యుంటారబ్బా..?

సోషల్ మీడియాలో సడెన్ గా 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు ఈ చీప్ స్టార్ ఎవరై ఉంటారని గుసగుసలు మొదలయ్యాయి. హీరో రవితేజనా..? అనే మాటలు వినిపిస్తున్నాయి. 

ajay bhupathi's cheap star tweet going viral
Author
Hyderabad, First Published Sep 3, 2019, 12:15 PM IST

'ఆర్ఎక్స్ 100' చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన దర్శకుడు అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకున్నాడు. ఈ సినిమా తరువాత ఇప్పటివరకు తన తదుపరి సినిమా అనౌన్స్ చేయలేదు ఈ డైరెక్టర్. 'మహాసముద్రం' అనే కథ పట్టుకొని హీరోల దగ్గరకి తిరుగుతున్నా.. ఎవరూ ఫైనల్ చేయడం లేదు.

ఈ క్రమంలో సోషల్ మీడియాలో సడెన్ గా 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేశాడు అజయ్ భూపతి. ఇప్పుడు ఈ చీప్ స్టార్ ఎవరై ఉంటారని గుసగుసలు మొదలయ్యాయి. హీరో రవితేజనా..? అనే మాటలు వినిపిస్తున్నాయి. అజయ్ తన తదుపరి సినిమా రవితేజతో చేయాలనుకున్నాడు.

స్క్రిప్ట్ కూడా వినిపించాడు. రవితేజ కొన్ని కరెక్షన్స్ చెప్పారు. కొంతకాలంగా ఈ ప్రాజెక్ట్ నలుగుతూ వస్తోంది. క్యాన్సిల్ అయిందనే మాటలు కూడా వినిపించాయి. ఇదే సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో చేద్దాం అనుకున్నారు కానీ కుదరలేదు. ఈ క్రమంలో అజయ్ ఈ స్క్రిప్ట్ ని నాగచైతన్య వద్దకు తీసుకువెళ్తున్నట్లు సమాచారం. 

'మహాసముద్రం' లైన్ హీరోయిన్ సమంతకు బాగా నచ్చిందట. కానీ ప్రాజెక్ట్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంతలో అజయ్ 'చీప్ స్టార్' అనే ట్వీట్ వేయడం వెనుక అర్ధమేంటో..? ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు 'ఎవరైనా స్క్రిప్ట్ రిజెక్ట్ చేశారా..?' అని అజయ్ ని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ.. ఆ 'చీప్ స్టార్' ఎవరయ్యుంటారబ్బా..?

 

Follow Us:
Download App:
  • android
  • ios