Asianet News TeluguAsianet News Telugu

తమ్ముడి పాత్రలో నటించిన వ్యక్తితో పెళ్లా.. స్పందించిన హీరోయిన్

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఓ నటుడితో రిలేషన్ షిప్ లో ఉందని, త్వరలో ఈ జంట వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 29 ఏళ్ల వయసున్న ఐశ్వర్య రాజేష్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. 

Aishwarya Rajesh getting married her co star  this year
Author
Hyderabad, First Published May 11, 2019, 8:45 AM IST

విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ నటిగా దూసుకుపోతోంది ఐశ్వర్య రాజేష్. కేవలం హీరోయిన్ గా మాత్రమే కాక నటనకు ప్రాధ్యానత ఉన్న అన్ని పాత్రల్లో నటిస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేష్ తమిళంలో దాదాపు 10 చిత్రాల్లో నటిస్తోంది. గత కొంతకాలంగా ఐశ్వర్య రాజేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  

ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం ఓ నటుడితో రిలేషన్ షిప్ లో ఉందని, త్వరలో ఈ జంట వివాహానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 29 ఏళ్ల వయసున్న ఐశ్వర్య రాజేష్ ఇక పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యిందట. ఇటీవల వీరిద్దరూ ఓ చిత్రంలో అక్కా తమ్ముడిగా కూడా నటించారట. ఈ మేరకు తమిళ మీడియా వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి. గతంలో తాను ఇంటర్మీడియట్ లోనే ప్రేమలోపడి మోసపోయానని ఐశ్వర్య రాజేష్ తెలిపిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం తనపై ప్రేమ, పెళ్లి అంటూ వస్తున్న ఊహాగానాలపై ఐశ్వర్య రాజేష్ తాజాగా స్పందించింది. తనపై వస్తున్న రూమర్లకు సోషల్ మీడియాలో చెక్ పెట్టింది. నా ప్రేమ కథ గురించి ఎన్నో రూమర్స్ వింటున్నా.. నా ప్రియుడు ఎవరో నాకు కూడా తెలియదు. అతడి గురించి చెప్పండి. తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది అంటూ సెటైర్లు వేసింది. 

ఇకనైనా ఫేక్ న్యూస్ ప్రచారం చేయడం ఆపండి. నిజంగా అలాంటిది ఏమైనా ఉంటే తానే స్వయంగా ప్రకటిస్తానని ఐశ్వర్య రాజేష్ తెలిపింది. ప్రస్తుతం సింగిల్ గా చాలా సంతోషంగా ఉన్నానని ఐశ్వర్య రాజేష్ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios