ఆమె చేతికి బ్యాండేజ్‌ వేసుకుని కనిపించింది. దాంతో  ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందారు.   

ఐశ్వర్యరాయ్ లాస్ట్ వీకెండ్ లో మణికట్టుకు గాయమైంది, గాయం ఉన్నప్పటికీ, ఆమె ఈ సంవత్సరం కూడా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొనాలని డిసైడ్ అయ్యింది. నిపుణులు, వైద్యులతో చర్చించిన తర్వాతే ఆమె ఫ్రాన్స్ వెళ్లారు. త్వరలో ఆమె చేతికి చిన్నపాటి సర్జరీ చేయాల్సి ఉంటుందని తెలుస్తోంది. వచ్చే వారంలో ఆమె చేతికి శస్త్రచికిత్స చేయించుకుంటుందని ముంబై మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మెరిసింది. ఫ్రాన్స్‌ వేదికగా ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు సెలబ్రిటీలు ఈ ఈవెంట్​కు హాజరై సందడి చేసారు. ఆ వేడుకలో పాల్గొనేందుకు బయలు దేరుతూ మంబై ఎయిర్‌పోర్ట్‌లో కెమెరాకు చిక్కారు తల్లికూతుళ్ల ద్వయం. అప్పుడే ఆమె చేతికి బ్యాండేజ్‌ వేసుకుని కనిపించింది. దాంతో ఆమెకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందారు.

కూతురు ఆరాధ్య తల్లి చేతికి గాయం అయ్యిందని ఆమె టోట్‌ బ్యాగ్‌ని తాను తీసుకుని అమ్మకు కాస్త ఉపశమనం కలిగించింది. తల్లి కూతుళ్లు ఇద్దరు మంచి స్టయిలిష్‌ డ్రెస్‌లతో స్టన్నింగ్‌ లుక్‌లో కనిపించారు. ఐశ్వర్య ఫ్యాంటుపై లూయిస్‌ విట్టన్‌ ట్రెంట్‌ కోట్‌లో అబ్బరపర్చగా, ఆరాధ్య నల్లటి ఫ్యాంటుపై తెలుపు స్పీకర్లతో కూడిన స్వెట్‌షర్ట్‌లో ఉంది. 

తాజాగా ఆమె తన కూమార్తెతో ఫ్రాన్స్‌ నుంచి ముంబైకి తిరిగొచ్చింది. గత 20 ఏళ్లుగా కేన్స్‌ ఫెస్టివల్‌ రెడ్‌ కార్పెట్‌పై ఆమె మెరుస్తూనే ఉంది. అయితే ఈసారి తన చేతికి గాయం అయింది. దానిని ఏమాత్రం లెక్కచేయని ఐశ్వర్య నూతన డిజైనర్‌ దుస్తుల్లో కార్పెట్‌పై హొయలుపోతూ కనిపించింది.