మాజీ విశ్వ సుందరి ఐశ్వర్య రాయ్ కూతురు మొట్టమొదటిసారిగా స్టేజీ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇంగ్లీష్ నాటకంలో అదరగొట్టింది. వీడియో నెట్టింట వైరల్ గా మారింది. స్టార్ కిడ్ తన నటనతో ఆకట్టుకుంటోంది. తల్లిగా ఐశ్వర్య రాయ్ ఎంగానో మురిసిపోయింది. 

బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్ (Aishwarya Rai Bachchan) , అభిషేక్ బచ్చన్ కూతురు ఆరాధ్య బచ్చన్ (Aaradhya Bachchan) తాజాగా వార్తల్లో నిలిచింది. తన మొదటి స్టేజీ పెర్ఫామెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆరాధ్య బచ్చన్ గత రాత్రి ఆమె స్కూల్లో జరిగిన యాన్యువల్ డే సందర్భంగా స్టేజీ పెర్ఫామెన్స్ ఇచ్చి అందరినీ ఆకట్టుకుంది. దానికి సంబంధించిన వీడియోలు క్రేజీగా వైరల్ అవుతున్నాయి. ఓ ఇంగ్లీష్ నాటకంలో ఆరాధ్య నటనకు బచ్చన్ అభిమానులు ఫుల్ ఫిదా అవుతున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇంగ్లీష్ లో తను చెప్పే డైలాగ్స్, నటన, హావభావాలను పలికించిన తీరుకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసిస్తున్నారు. తల్లిని మించిపోయేలా మున్ముందు నటించగల సామర్థ్యం ఉందంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐశ్వర్య రాయ్ తన కూతురు స్టేజీ పెర్ఫామెన్స్ ను తన ఫోన్లో బంధించింది తల్లిగా ఎంతగానో మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాత అమితాబ్ బచ్చన్ కూడా మనవరాలి ప్రదర్శనను మెచ్చుకున్నారు. 

ఇక ఆరాధ్య బచ్చన్ తన స్కూల్‌లోని చాలా మంది విద్యార్థులతో కలిసి పాఠశాల వార్షిక దినోత్సవ వేడుకలో సంగీత నాటకంలో ఇలా పాల్గొంది. ఈ కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న వారి పిల్లలు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కి సంబంధించిన వీడియో ఆకట్టుకుంటోంది. నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశర్య రాయ్, తన తల్లి కూడా హాజరైంది. 

Scroll to load tweet…