రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఓవరాల్ గా  ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్.. రూ.15 కోట్లు మాత్రమే రాబట్టింది.   

సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ లాల్ సలామ్(Lal Salaam) ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో తెలిసిందే. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్(Aishwarya Rajinimath) డైరెక్షన్ లో వచ్చిన ఈ పాన్ ఇండియా మూవీలో విష్ణు విశాల్(Vishnu Vishal), విక్రాంత్(Vikranth) హీరోలుగా చెయ్యగా రజనీ గెస్ట్ రోల్ లో కనిపించారు. జైలర్(Jailer) లాంటి బ్లాక్ బస్టర్ తరువాత రజినీకాంత్ కనిపిస్తున్న సినిమా కావడంతో లాల్ సలామ్ పై మంచి అంచనాలు క్రియేట్ అవ్వగా...వాటిని అందుకోవడంలో ఘోరంగా విఫలమయింది. ఈ మూవీ మార్నింగ్ షో నుండే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో మినిమమ్ కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా రూ.27 కోట్ల గ్రాస్.. రూ.15 కోట్లు మాత్రమే రాబట్టింది. రజినీకాంత్ కెరీరి లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా లాల్ సలామ్ నిలిచింది. అయితే ఈ ఈ డిజాస్టర్ కు కారణం తన తండ్రే అంటోంది ఐశ్వర్య రజనీకాంత్.

ఐశ్వర్య మీడియాతో మాట్లాడుతూ... “మేము మొదట ఒరిజనల్ స్క్రిప్టు అనుకున్నప్పుడు ..నాన్న చేసిన మెయిద్దీన్ పాత్ర సెకండాఫ్ లో కేవలం ఓ 10 నిముషాలు మాత్రమే వస్తుంది. కానీ రజనీకాంత్ ఫస్టాఫ్ లో మిస్ అయ్యితే ఆయన అభిమానులు రెస్ట్ లెస్ గా ఫీలవుతారని,రిలీజ్ కు ముందు మేము ఎడిటింగ్ లో కొన్ని మార్పులు చేసాము. ఫస్టాఫ్ లోనే మెయిద్దీన్ పాత్రను పరిచయం చేసాము. ఎప్పుడైతే ఫస్టాఫ్ లో ఆయన పాత్రను ప్రేక్షకులు చూసారో..సెకండాఫ్ అంతా ఆయనే ఉంటారని భావించారు..ఎక్సపెక్ట్ చేసారు..ఆ పాత్రపైనే ఫోకస్ పెట్టడం మొదలెట్టారు. దాంతో కథ ఓవర్ షాడో అయ్యిపోయింది. మిగతా పాత్రలను వాళ్లు పట్టించుకోలేదు,”అని వివరించింది.

కేవలం రిలీజ్ కు రెండు రోజులు ముందు చేసిన ఆ మార్పులే సినిమా రిజల్ట్ ని మార్చేసాయాని అంది. ఐశ్వర్య డైరక్ట్ గానే రజనీ ప్రెజెన్స్ ..స్క్రిప్టు మొత్తాన్ని మార్చేసిందని చెప్పుకొచ్చింది. అయితే ఇది విన్న అభిమానులు అసలు రజనీను ఈ కథలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఎలా చేస్తే సినిమా ఆడుతుందనేది డైరక్టర్ కు ఖచ్చితమైన ఆలోచన ఉండాలని , స్క్రీన్ ప్లే డిజైన్ ముందుగా చేసుకున్న దానిని చివర్లో మార్చకూడదని మరోసారి గుర్తు చేసినట్లు అయ్యిందని ఇండస్ట్రీ జనం అంటున్నారు. 

 లాల్ సలామ్ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. మొదట ఈ సినిమాకు రజనీ ఒప్పుకున్నది కేవలం తన కూతురు దర్శకత్వం అనే అనేది నిజం. లేకపోతే రజనీ గెస్ట్ రోల్ లో చేయరు. కానీ ట్రైలర్, టీజర్ రిలీజైన తర్వాత ఈ చిత్రానికి ఓ రేంజిలో క్రేజ్ పెరిగిపోయింది. ఈ చిత్రంలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్‌ కీలక పాత్రలో నటించారు. ఒక చిన్న గ్రామంలో రెండు మతాల మధ్య వైరం, దానికి క్రికెట్ పోటీ వంటి భావోద్వేగాలతో లాల్ సలామ్ తెరకెక్కించారు.