సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలంటే స్టార్ డమ్ అవసరం లేదని యువ హీరోలు వారి టాలెంట్ తో నిరూపిస్తున్నారు. సినిమా కంటెంట్ కి తగ్గట్టు నటించి ఆడియెన్స్ ని మెప్పిస్తే డే నైట్ లోనే రికార్డ్స్ బ్రేక్ చేయవచ్చని ఇటీవల విజయ్ దేవరకొండ నీరుపించగా మెగా హీరో వరుణ్ తేజ్ కూడా అదే స్థాయిలో హిట్టందుకున్నాడు. 

30 ఏళ్ళు లేని ఈ యంగ్ హీరోలు 50 కోట్ల షేర్స్  మార్క్ ను ధాటి బాక్స్ ఆఫీస్ బాద్షాలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. 29 ఏళ్ల విజయ్ గీత గోవిందం సినిమాతో 60 కోట్లకు పైగా లాభాలను అందుకున్న హీరోగా రికార్డ్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మెగా యువ హీరో వరుణ్ తేజ్ కూడా F2 సినిమాతో ఈజీగా 60 కోట్ల షేర్స్ ను అందుకున్నాడు. 

వరుణ్ తో పాటు వెంకీకి కూడా ఈ క్రెడిట్ దక్కుతుంది. కానీ ఎక్కువ లాభాలను అందించిన తక్కువ వయసున్న హీరోల్లో వరుణ్ విజయ్ లు మాత్రమే ఉన్నారు. వీరి దూకుడు చూస్తుంటే భవిష్యత్తులో స్టార్ హీరోల రేంజ్ కు ఇంకాస్త దగ్గరగా వెళ్లనున్నారని చెప్పవచ్చు.