Asianet News TeluguAsianet News Telugu

భర్త అరెస్ట్ తో అజ్ఞాతంలోకి శిల్పా శెట్టి!

భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం శిల్పా శెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆమె ఆచూకీ తెలుసుకొనే పనిలో మీడియా బిజీగా ఉంది. రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్పా శెట్టి రియాక్షన్ తెలుసుకోవాలని అందరూ భావిస్తున్నారు.

after raj kundra arrest shilpa shetty went under ground ksr
Author
Hyderabad, First Published Jul 21, 2021, 3:14 PM IST

సోమవారం బాలీవుడ్ లో సంచలనం నమోదయ్యింది. హీరోయిన్ శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోర్నోగ్రఫీ ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కుంద్రా నేరానికి పాల్పడినట్లు పోలీసులు బలమైన ఆధారాలు సేకరించినట్లు తెలుస్తుంది. ముంబైలోని రాజ్ కుంద్రా ఆఫీస్ లో దీనికి సంబంధించిన కీలక సమాచారం పోలీస్ అధికారులు సేకరించారు. 


కాగా భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ అనంతరం శిల్పా శెట్టి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తుంది. ఆమె ఆచూకీ తెలుసుకొనే పనిలో మీడియా బిజీగా ఉంది. రాజ్ కుంద్రా అరెస్ట్ పై శిల్పా శెట్టి రియాక్షన్ తెలుసుకోవాలని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం డాన్సర్ రియాలిటీ షో... సూపర్ డాన్సర్ 4 జడ్జెస్ లో ఒకరిగా శిల్పా శెట్టి ఉన్నారు. ఈ షో షూటింగ్ కి కూడా ఆమె డుమ్మా కొట్టినట్లు సమాచారం. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జుహూ నివాసంలో ఉన్నట్లు కొందరు భావిస్తున్నారు. 


మరోవైపు ఈ కేసులో శిల్పా శెట్టి పాత్రపై కూడా పోలీసులు విచారణ చేపట్టారని వినికిడి. శిల్పా శెట్టికి రాజ్ కుంద్రా చట్ట వ్యతిరేక కార్యకలాపాలతో సంబంధం ఉన్న నేపథ్యంలో ఆమెను కూడా విచారించే అవకాశం కలదు. ఇక గతంలో కూడా శిల్పా శెట్టి దంపతులు నేరారోపణలు ఎదుర్కొన్నారు. ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫ్రాంచైజీలు గా ఉన్న శిల్పా, రాజ్ కుంద్రా ఫిక్సింగ్ కి పాల్పడినట్లు తెలిసింది. దీనితో ఐపీఎల్ నుండి రాజ్ కుంద్రా బహిష్కరించబడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios