ప్రముఖ పోర్న్ స్టార్ సోఫియా లియోన్ హఠాన్మరణం చెందారు. సోఫియా పోర్న్ నటిగా రాణిస్తున్నారు. అమెరికాలోని మియామికి చెందిన సోఫియా కేవలం 26 ఏళ్ళ పిన్న వయసులోనే మరణించడం సంచలనంగా మారింది.

ప్రముఖ పోర్న్ స్టార్ సోఫియా లియోన్ హఠాన్మరణం చెందారు. సోఫియా పోర్న్ నటిగా రాణిస్తున్నారు. అమెరికాలోని మియామికి చెందిన సోఫియా కేవలం 26 ఏళ్ళ పిన్న వయసులోనే మరణించడం సంచలనంగా మారింది. ఆమె మృతి పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. 

ఆమె మరణించి వారం రోజులు గడిచినట్లు తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యులు మాత్రం ఆలస్యంగా మీడియాకి సమాచారం ఇచ్చారు. సోఫియా తన అపార్ట్మెంట్ లోనే విగతజీవిగా కనిపించిందట. మొదట సోఫియా మరణాన్ని ఆమె సవతి తండ్రి గుర్తించినట్లు చెబుతున్నారు. 

ఆమె అపార్ట్మెంట్ డోర్స్ కొట్టగా ఎలాంటి స్పందన లేకుండా అపస్మారక స్థితిలో సోఫియా కనిపించింది. దీనితో డోర్స్ బ్రేక్ చేసి చూస్తే ఆమె అప్పటికే మరణించినట్లు చెబుతున్నారు. అయితే సోఫియా ఆత్మ హత్య చేసుకుందా ? మరణానికి కారణాలు ఏంటి ? లాంటి విషయాల్లో ఇంతవరకు క్లారిటీ లేదు. 

అయితే సోఫియా కుటుంబ సభ్యులు మాత్రం తీవ్ర విషాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. సోఫియా అడల్ట్ స్టార్ అయినప్పటికీ తన చుట్టూ ఉన్న వారిని సంతోషంగా చూసుకునేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆమె జంతు ప్రేమికురాలట. సోఫియా ఇంట్లో 3 పెట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషాదం నుంచి మాత్రం సోఫియా కుటుంబ సభ్యలు ఇప్పట్లో కోలుకునేలా లేరని ఆమె సవతి తండ్రి మీడియాకు తెలిపారు. 

ఇక్కడ అనుమానాలు మరింత పెంచుతున్న అంశం ఏంటంటే.. గత రెండు నెలల్లో పోర్న్ నటి మరణించడం ఇది మూడవది. గత నెలలో లిన్ కార్టార్ 36 ఏళ్ళ వయసులో అనుమానాస్పద రీతితో తన నివాసంలో మరణించారు. జనవరిలో జెస్సీ జానే అనే 43 ఏళ్ళ పోర్న్ నటి అధిక మోతాదులో డ్రగ్స్ వల్ల మరణించారు. తాజాగా సోఫియా 26 ఏళ్ళ అతి పిన్న వయసులో మరణించడం సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.