Asianet News TeluguAsianet News Telugu

'చీకటి గదిలో చితకొట్టుడు' ఫైనల్ గా ఇదీ పరిస్దితి

తెలుగులో ఇప్పటివరకూ రాని అడల్ట్ కామెడీ హారర్ జానర్ లో వచ్చిన చిత్రం ‘చీకటి గదిలో చితకొట్టుడు’. 

Adult Comedy Chikati GadiLo Chithakkotudu ends as a safe project
Author
Hyderabad, First Published Apr 3, 2019, 9:36 AM IST

తెలుగులో ఇప్పటివరకూ రాని అడల్ట్ కామెడీ హారర్ జానర్ లో వచ్చిన చిత్రం ‘చీకటి గదిలో చితకొట్టుడు’. తమిళంలో వచ్చి విజయవంతమైన చిత్రాన్ని తెలుగులో కొంత భాగం రీషూట్ చేసి వదిలారు. ఇక్కడ ఆర్టిస్ట్ లతో ఈ సినిమాకు నేటివిటి లుక్ తెచ్చే ప్రయత్నం చేసారు. డైరక్ట్ గా డబ్బింగ్ చేసి వదలకుండా నిర్మాతలు చేసిన ప్రయత్నం ,ప్రమోషన్ ఏ మేరకు కలసి వచ్చింది..సినిమాకు పెట్టిన పెట్టుబడి వెనక్కి తెచ్చుకుగలిగిందా అనేది ట్రేడ్ లో ఆసక్తికరమైన విషయంగా మారింది.

బ్లూ ఘోస్ట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్‌, నిక్కి తంబోలి, హేమంత్‌, తాగుబోతు ర‌మేష్‌, ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన చిత్రం ‘చీక‌టి గ‌దిలో చిత‌క్కొట్టుడు’. సంతోష్ పి. జయకుమార్ దర్శకుడు. మార్చి నెల 21న విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ రాబట్టుకొంది. ఈ సినిమా ఇంకా చాలా చోట్ల ధియోటర్ లో ఉండటం ఈ సినిమా సక్సెస్ స్దాయిని చెప్తోంది.   

ఈ సినిమాపై పెట్టుబడి రాబట్టడమే కాక, సేఫ్ ప్రాజెక్టుగా అందరికీ తలో రూపాయి మిగిలే సినిమాగా ఫైనల్ గా తేలింది. ఈ సినిమా తీసుకున్న డిస్ట్రిబ్యూటర్స్ ఖుషీగా ఉన్నారు. భారీ రేట్లకు తాము తీసుకోలేదని, దాంతో భారీగా కలెక్షన్స్ రాకపోయినా మంచి ఆక్యుపెన్సీతో కొద్ది పాటి లాభాలు తెచ్చిపెడుతోందని చెప్తున్నారు. ప్యామీలలు రాకున్నా కేవలం కుర్రాళ్లుతో హౌస్ ఫుల్స్ అవుతున్నాయని.,అందుకే సెకండ్ వీక్ సైతం రన్ చేస్తున్నామని అంటున్నారు. మరో ప్రక్క ఈ సినిమాకు పోటీగా వేరే సినిమాలు ఏమీ లేకపోవటం కూడా కలిసొచ్చిన అంశం. 

అలాగే అదే రోజు రిలీజైన మరో చిత్రం విషయానికి వస్తే.. ఉన్నికృష్ణన్‌ దర్శకత్వంలో ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ్ యాక్షన్ హీరో విశాల్, శ్రీకాంత్, హన్సిక, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో వచ్చిన చిత్రం ‘పులిజూదం’. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా చూడటానికి జనం పెద్దగా ఆసక్తి చూపలేదు. ఫెయిలైంది. మొత్తానికి అడల్ట్ కామెడీనే వర్కవుట్ అయ్యింది. 

Follow Us:
Download App:
  • android
  • ios