Asianet News TeluguAsianet News Telugu

HIT 2 Trailer: పోలీసులకు సవాల్ విసిరిన రక్తం తాగే సైకో కిల్లర్!

అమ్మాయిలను దారుణంగా చంపుతున్న సీరియల్ సైకో కిల్లర్ ని హీరో ఎలా పట్టుకున్నాడనేదే హిట్ 2 మూవీ అని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. మొత్తంగా హిట్ 2 ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. 

adivi shesh starer hit 2 trailer rises expectations
Author
First Published Nov 23, 2022, 2:05 PM IST


పర్ఫెక్ట్ గా తెరకెక్కిస్తే క్రైమ్ థ్రిల్లర్స్ కి మించిన ఎంటర్టైనర్స్ ఉండవు. నెక్స్ట్ ఏం జరుగుతుందని ప్రేక్షకులు కుర్చీల చివరకు చేరి కళ్ళు అప్పగించి శ్రద్ధగా సినిమా చూస్తారు . దర్శకుడు శైలేష్ కొలను ఫస్ట్ మూవీతోనే టాలెంటెడ్ దర్శకుడిగా నిరూపించుకున్నాడు. విశ్వక్ సేన్ హీరోగా ఆయన తెరకెక్కించిన 'హిట్' మూవీ విజయం సొంతం చేసుకుంది. కనిపించకుండా పోయిన అమ్మాయి ఆచూకి కోసం వెతికే పోలీస్ గా విశ్వక్ సేన్ నటించారు.దర్శకుడు కిడ్నాప్ క్రైమ్ డ్రామా రక్తి కట్టించారు. 

హిట్ చిత్రానికి కొనసాగింపుగా శైలేష్ కొలను మరో థ్రిల్లర్ తో వచ్చేశారు. 'హిట్ 2'-సెకండ్ కేస్ అంటూ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కరి చేయనున్నారు. సంజన అనే అమ్మాయిని చంపిన సైకో కిల్లర్ కథే హిట్ 2. సంజనను చంపిన హంతకుడు ఎవరనే కోణంలో మొదలైన ఇన్వెస్టిగేషన్ ఊహించని మలుపులు తీసుకుంటుంది. తాము వెతుకుతున్న కిల్లర్ ఇంటెలిజెంట్ సైకో అని తెలిసొస్తుంది. 

చనిపోయింది సంజన మాత్రమే కాదని తెలిసి పోలీసుల మైండ్ బ్లాక్ అవుతుంది. అమ్మాయిలను దారుణంగా చంపుతున్న సీరియల్ సైకో కిల్లర్ ని హీరో ఎలా పట్టుకున్నాడనేదే హిట్ 2 మూవీ అని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు. మొత్తంగా హిట్ 2 ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ప్రేక్షకులు అద్భుతమైన థ్రిల్లర్ ఎంజాయ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చింది. అడివి శేష్ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు. రావు రమేష్, తనికెళ్ళ భరణి, పోసాని కీలక రోల్స్ చేశారు. 

హిట్ 2 మూవీని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో హీరో నాని నిర్మించారు. శ్రీలేఖ, సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. డిసెంబర్ 2న హిట్ 2 విడుదల కానుంది. అడివి శేష్ హీరోగా గతంలో క్షణం, ఎవరు వంటి క్రైమ్ థ్రిల్లర్స్ చేశారు. అవి రెండు సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇక హిట్ 2 తో అడివి శేష్ ఎలాంటి సంచనాలు నమోదు చేయనున్నాడో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios