Asianet News TeluguAsianet News Telugu

హిట్ 2... అడివి శేష్ టార్గెట్ ఎంతంటే?

క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన హిట్ 2 ట్రైలర్ అంచనాలు పెంచేసింది. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విశ్వక్ సేన్ హీరోగా విడుదలైన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్.దర్శకుడు శైలేష్ కొలను మల్టీవర్స్ కాన్సెప్ట్ తో వరుస థ్రిల్లర్స్ రూపొందిస్తున్నారు. సినిమాపై హైప్ ఏర్పడిన నేపథ్యంలో బాగానే బిజినెస్ చేసినట్లు సమాచారం అందుతుంది.

Adivi shesh starer hit 2 pre release business details
Author
First Published Dec 1, 2022, 1:32 PM IST

వరుస విజయాలతో అడివి శేష్ జోరు మీదున్నారు. ఆయన గత చిత్రాలు ఎవరు, మేజర్ భారీ విజయాలు సాధించాయి. తాజాగా ఆయన హిట్ 2 చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కిన హిట్ 2 ట్రైలర్ అంచనాలు పెంచేసింది. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. విశ్వక్ సేన్ హీరోగా విడుదలైన హిట్ చిత్రానికి ఇది సీక్వెల్.

దర్శకుడు శైలేష్ కొలను మల్టీవర్స్ కాన్సెప్ట్ తో వరుస థ్రిల్లర్స్ రూపొందిస్తున్నారు. సినిమాపై హైప్ ఏర్పడిన నేపథ్యంలో బాగానే బిజినెస్ చేసినట్లు సమాచారం అందుతుంది. హిట్ 2 నైజాం రైట్స్ రూ.4 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ఆంధ్రాలో రూ.4.5 కోట్ల బుజినెస్ చేసిందట. రెస్టాప్ ఇండియా, ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ హిట్ 2 రూ. 13 కోట్లకు పైగా బిజినెస్ చేసినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.

అంటే హిట్ 2 విజయం సాధించాలి అంటే... రూ. 14 నుండి 15 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై హీరో నాని ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 2న వరల్డ్ వైడ్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఇక ఈ మూవీలో ఊహించని మలుపు ఉంటాయని సమాచారం. ముఖ్యంగా విలన్ విషయంలో షాక్ కి గురవుతారట. ఇక దర్శకుడు శైలేష్... హిట్ త్రీ సైతం ఉంటుంది అన్నారు. ఆ మూవీ హీరోని రివీల్ చేస్తారట. ఇలా అనేక సర్ప్రైజ్ లు హిట్ 2 మూవీలో ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios