Asianet News TeluguAsianet News Telugu

ఇంటర్ పోల్ ఏజెంట్ బోట్ లో అమ్మాయితో ఏంటి ..నాగ్ ని నిర్మొహమాటంగా అడిగేసిన అడివి శేష్

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలవుతున్న ఘోస్ట్ పై పాజిటివ్ బజ్ ఉంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. నాగార్జున చాలా రోజుల తర్వాత యాక్షన్ మూవీ చేస్తుండడంతో ఆసక్తిగా మారింది.

Adivi Sesh Interesting questions to Nagarjuna
Author
First Published Oct 3, 2022, 8:14 PM IST

ప్రవీణ్ సత్తారు ప్రతిభ ఉన్న దర్శకుడు అని చెప్పడంలో సందేహం లేదు. గరుడ వేగ లాంటి సీరియస్ యాక్షన్ డ్రామాని అద్భుతంగా తెరకెక్కించాడు. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు కింగ్ నాగార్జునతో ఘోస్ట్ చిత్రం తెరకెక్కిస్తున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ఇది. 

దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదలవుతున్న ఘోస్ట్ పై పాజిటివ్ బజ్ ఉంది. ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. నాగార్జున చాలా రోజుల తర్వాత యాక్షన్ మూవీ చేస్తుండడంతో ఆసక్తిగా మారింది. తాజాగా ఘోస్ట్ కి సాయం చేసేందుకు గూఢచారి రంగంలోకి దిగాడు. అవును.. ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ కోసం గోపి 116 వచ్చేశాడు. 

ఘోస్ట్ ప్రమోషన్స్ లో భాగంగా క్రేజీ హీరో అడివి శేష్.. నాగార్జునని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. మీరు ఇంటర్ పోల్ ఏజెంట్ విక్రమ్ కదా అని అడివి శేష్ నాగ్ ని అడగగా.. నువ్వు గోపి 116 కదా అని నాగ్ అంటారు. 

ఇంటర్ పోల్ ఏజెంట్ అంటే అంత కూల్ గా తిరుగుతారా.. మంచి బోట్ మీద హీరోయిన్ తో రొమాన్స్ అని అర్థం వచ్చేలా అడివి శేష్ నిర్మొహమాటంగా నాగ్ ని ప్రశ్నించాడు. దీనికి నాగ్ ఎలాంటి సమాధానం ఇచ్చారు కంప్లీట్ ఇంటర్వ్యూలో చూడాలి. 

నాకంటూ నేను ఒక జోనర్ సెట్ చేసుకున్నాను.. ఇప్పుడు మీరు కూడా ఆ జోనర్ లోకి వచ్చేస్తే నేను ఏం చేయాలి అని సరదాగా అడివి శేష్ నాగ్ ని ప్రశ్నించారు. నాగార్జున తొలిసారి కత్తి ఫైట్ చేయడం గురించి కూడా అడివి శేష్ ప్రశ్నించారు. వీరిద్దరి మద్య సరదా సంభాషణ ఎలా జరిగిందో తెలియాలంటే కంప్లీట్ ఇంటర్వ్యూ కోసం వైట్ చేయాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios