Asianet News TeluguAsianet News Telugu

శ్రీరెడ్డి యూట్యూబ్ ఛానెల్.. ఇక రచ్చ రచ్చే!

ఇప్పటివరకు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. 

actress srireddy comments on nagababu
Author
Hyderabad, First Published Mar 8, 2019, 11:11 AM IST

ఇప్పటివరకు ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన శ్రీరెడ్డి ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ ఛానెల్ పెట్టింది. ఆ వెంటనే మెగాఫ్యామిలీ టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం మొదలుపెట్టింది.

మెగా బ్రదర్ నాగబాబు 'అంతా నా ఇష్టం' యూట్యూబ్ ఛానెల్ కి పోటీగా 'నా ఛానెల్ నా ఇష్టం' అంటూ నయా వ్యాపారం మొదలెట్టింది. ఇటీవల నాగబాబు.. టీడీపీ అధికార ప్రతినిధి యామిని విషయంలో చేసిన వ్యాఖ్యలను పట్టుకొని.. 'మీరు ఎంత పక్షపాతంతో వ్యవహరిస్తున్నారో అర్ధం అవుతుందా..?' అంటూ నాగబాబుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంత వయసు వచ్చినా.. సిగ్గు, బుడ్డి అనేవి అబ్బలేదని మండిపడింది. సాధినేని యామినిపై దారుణంగా ట్రోల్ చేసే వారిని వెనకేసుకొస్తున్నారని.. ఇదే పరిస్థితి మీ అమ్మాయికి వస్తే.. ఇలానే స్పందిస్తారా..? అంటూ ప్రశ్నించింది.

''ఇదేమైన 'జబర్దస్త్' అనుకుంటున్నావా..? జబర్దస్త్ లేకపోతే అసలు నాగబాబు ఎవడు..? చిరంజీవి తమ్ముడు.. లేదంటే పవన్ కళ్యాణ్ అన్నయ్య.. నీకంటూ సొంతంగా ఐడెంటిటీ లేదు.. నీకు ఒక స్థాయి లేదు'' అంటూ ఓ రేంజ్ లో మండిపడింది. 

Follow Us:
Download App:
  • android
  • ios