Asianet News TeluguAsianet News Telugu

''ఒకే ఒక్క ఛాన్స్'' ఇండస్ట్రీలో నా పరిస్థితి కూడా ఇదే.. సంగీత షాకింగ్ కామెంట్స్!

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన బ్యూటీ సంగీత.

actress sangeetha shocking comments
Author
Hyderabad, First Published Jun 7, 2019, 3:06 PM IST

టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసింది. కుటుంబ కథా చిత్రాల్లో ఎక్కువగా కనిపించిన బ్యూటీ సంగీత. ఆమె ఎన్ని చిత్రాల్లో నటించినా 'ఖడ్గం' సినిమాలో ఆమె చెప్పే 'ఒక్క ఛాన్స్ ఒకే ఒక్క ఛాన్స్' డైలాగ్ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు.

అంతగా ఆ సినిమాలో తన నటనతో మెస్మరైజ్ చేసింది. అయితే నిజ జీవితంలో కూడా తాను ఆ ఒక్క ఛాన్స్ అంటూ తిరిగినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది సంగీత. ప్రముఖ కమెడియన్ అలీ నిర్వహించే 'అలీతో సరదాగా' షోకి వచ్చిన సంగీత తన వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది.

దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. షోలో భాగంగా అలీ.. 'ఖడ్గం సినిమాలో ఒక్క ఛాన్స్ డైలాగ్ ఉంది కదా.. అలా రియల్ లైఫ్ లో ఎవరినైనా అడిగావా..?' అంటూ ప్రశ్నించగా.. దానికి సంగీత.. '' నిజంగా నా పరిస్థితి కూడా ఆ ఒక్క చాన్స్ ఒకే ఒక్క ఛాన్స్..'' అంటూ షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది.

''ఇదంతా మన సినిమా ఇండస్ట్రీలో ఉంది.. నిజంగా ఇలా కూడా జరుగుతుంది'' అంటూ పరోక్షంగా కాస్టింగ్ కౌచ్ పై కామెంట్స్ చేసింది. మన పరిస్థితి కూడా ఇదే కదా అని కొన్ని దృశ్యాలు చూసినప్పుడు అనిపిస్తుంటుందని వెల్లడించింది. ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇండస్ట్రీలో అమ్మాయిలను వేధిస్తున్నారని సంగీత మాటల్లో అర్ధమవుతుందని దర్శకనిర్మాతల ఆలోచన తీరు మారాలని కామెంట్స్ చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios