బెంగాళీ నటి కోయల్‌ మాలిక్‌ సహా ఆమె కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. శుక్రవారం రాత్రి ఈ మేరకు కోయల్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో తన తండ్రి లెజెండరీ బెంగాళీ నటుడు రంజిత్ మాలిక్‌, తన తల్లి దీపా మాలిక్‌, భర్త, నిర్మాత నిష్పల్ సింగ్‌లకు కూడా కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యిందని వెల్లడించింది.

ఆ ట్వీట్‌ తాను కుటుంబ సభ్యులతో సహా క్వారెంటైన్‌లో ఉంటున్నట్టుగా తెలిపింది. దీంతో ఒక్కసారిగా బెంగాళీ సినిమా పరిశ్రమ షాక్‌కు గురైంది. ప్రముఖ దర్శకుడు సత్రజిత్ సేన్‌, నటుడు విక్రమ్‌ ఛటర్జీ, జీత్‌లు కోయల్, కుటుంబ సభ్యులు కోలుకోవాలని విష్ చేశారు. కోయల్ మాలిక్‌ బెంగాళీ ఇండస్ట్రీ స్టార్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఘోరే అండ్‌ బైరే, చాయా ఓ చోబీ, శుభోద్రిష్టి, హెమ్లోక్‌ సోసైటీ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. కోయల్  మాలిక్‌ 2013లో నిర్మాత అయిన నిష్పల్‌ సింగ్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఈ ఏడాది మేలో మగబిడ్డ జన్మించాడు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు కోయల్‌, నిష్పల్‌.