Khushboo : త్రిష, మన్సూర్ ఇప్పుడు బాగానే ఉన్నారు.. మధ్యలో ఖుష్బూ బుక్కైపోయిందిగా, ఏం జరిగిందంటే

ఎట్టకేలకు మన్సూర్ త్రిషని బహిరంగంగా క్షమాపణ కోరడంతో వివాదం ముగిసింది.ఇప్పుడు త్రిష, మన్సూర్ బాగానే ఉన్నారు. కానీ మధ్యలో సీనియర్ నటి ఖుష్బూ అడ్డంగా బుక్కైంది.

Actress Khushboo in trouble for supporting trisha dtr

దళపతి విజయ్ లియో చిత్రంలో నటించిన మన్సూర్ అలీ ఖాన్ త్రిషని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఎంత దుమారం రేపాయో తెలిసిందే. పలువురు సినీతారలు మన్సూర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు. మొదట తన తప్పేమి లేదని క్షమాపణ చెప్పనని మన్సూర్ మొండికేశారు. 

కానీ ఎట్టకేలకు మన్సూర్ త్రిషని బహిరంగంగా క్షమాపణ కోరడంతో వివాదం ముగిసింది. లియో చిత్రంలో త్రిషని రేప్ చేసే అవకాశం రాలేదు అంటూ నిరాశ పడుతున్నట్లు వ్యాఖ్యలు చేశాడు. త్రిష ఈ చిత్రంలో నటిస్తుంది అని చెప్పినప్పుడు ఆమెతో బెడ్ రూమ్ లో రేప్ సీన్ ఉంటుందని భావించా. చాలా చిత్రాల్లో నేను రేప్ సన్నివేశాల్లో నటించా. నాకేమి కొత్త కాదు. త్రిషని నా చేతులతో బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లే సీన్ ఉంటుందని అనుకున్నా. కానీ ఈ చిత్రంలో నాకు త్రిషతో అసలు సన్నివేశాలే లేవు అంటూ వెకిలి నవ్వుతూ కామెంట్స్ చేశాడు. ఆ వ్యాఖ్యలే ఇంత పెద్ద వివాదానికి కారణం అయ్యాయి. 

మొత్తంగా వివాదం ముగిసింది అనుకుంటున్న తరుణంలో మరో ట్విస్ట్ వచ్చింది. ఇప్పుడు త్రిష, మన్సూర్ బాగానే ఉన్నారు. కానీ మధ్యలో సీనియర్ నటి ఖుష్బూ అడ్డంగా బుక్కైంది. త్రిషపై మన్సూర్ చేసిన వ్యాఖ్యలకు ఖుష్బూ తీవ్రంగా మండిపడింది. మన్సూర్ ని విమర్శించే క్రమంలో దళితుల మనోభావాలు కించపరిచేలా ఆమె స్లమ్ లాంటి కొన్ని పదాలు ఉపయోగించింది. 

దీనితో దళిత వర్గాలు ఆమెపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దళితులు ఇలాంటి భాషే మాట్లాడతారు అని అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. వెంటనే ఆ పదాలని వెనక్కి తీసుకోవాలని దళిత నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఆమెపై అట్రాసిటీ కేసు పెట్టాలని కోరుతున్నారు. 

ఈ విషయంలో ఖుష్బూ వెనక్కి తగ్గడం లేదు. రాజ్యాంగంలో లేని పదాలని నేను వాడలేదని ఆమె అంటున్నారు. మొత్తంగా ఖుష్బూ త్రిషకి సపోర్ట్ చేయబోయి చిక్కుల్లో పడింది. ఈ వివాదం ఎంత దూరం వెళుతుందో చూడాలి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios