Asianet News TeluguAsianet News Telugu

`మా` ఎన్నికలకు గ్లామర్‌.. అధ్యక్ష బరిలో నటి హేమ..

`మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇప్పటికే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌ పోటీలో ఉండగా, ఇప్పుడు కొత్తగా నటి హేమ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించింది.

actress hema contestant in maa election glamour added arj
Author
Hyderabad, First Published Jun 23, 2021, 4:06 PM IST

`మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌`(మా) ఎన్నికల్లో సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. `మా` అధ్యక్షుడి కోసం ఎన్నడూ లేని విధంగా నలుగురు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ప్రకాష్‌రాజ్‌, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్‌ పోటీలో ఉండగా, ఇప్పుడు కొత్తగా నటి హేమ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించింది. దీంతో `మా` కోసం నలుగురు ఢీ అంటే ఢీ అనబోతున్నారు. అంతేకాదు `మా` ఎన్నికలకు, ముఖ్యంగా అధ్యక్ష పదవికి గ్లామర్‌ తోడైనట్టుంది. అయితే ఇంకా `మా` ఎన్నికలకు నోటిఫికేషనే రాలేదు.. కానీ వరుసగా బరిలో నిలబోతున్న వారు అప్పుడే రాజకీయాలు స్టార్ట్ చేశారు. మద్దతు కూడగట్టుకునే పనిలో బిజీగా ఉన్నారు.

త‌న వారికోసం పోటీకి దిగుతున్నాన‌ని హేమ అంటున్నారు. హేమ మాట్లాడుతూ, `మాలో గ‌త కొన్నేళ్లుగా ఉపాధ్య‌క్షురాలిగా, సంయుక్త కార్య‌ద‌ర్శిగా, ఈసీ స‌భ్యురాలిగా ప‌ద‌వులు చేప‌ట్టాను. ప‌ద‌వుల‌కు న్యాయం చేశాను. ఈసారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న `మా` అసోసియేష‌న్ ఎన్నిక‌లు రానే వ‌చ్చాయి. ఈసారి ట్రెజ‌ర‌ర్ ప‌ద‌వికి పోటీ చేయాల‌ని అనుకున్నాను. ఎల‌క్ష‌న్ ముందు ఆలోచ‌న ఇది. కానీ ఆలోచ‌న మారింది. ఎల‌క్ష‌న్ ని ప్ర‌క‌టించ‌గానే ప్ర‌కాష్ రాజ్. మంచు విష్ణు బాబు. జీవిత గారు పోటీ చేస్తున్నార‌ని తెలిసింది. 

పెద్ద‌లంతా ఎల‌క్ష‌న్ బ‌రిలో దిగుతున్నారని తెలిసాక‌ పెద్ద‌లు పెద్ద‌ల వివాదాల్లో మ‌న‌మెందుకు చిక్కుకోవాలి. అస‌లు పోటీ చేయొద్ద‌నే అనుకున్నాను. నిన్నటి ప్ర‌క‌ట‌న అనంత‌రం సినీప్ర‌ముఖుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను ఉపాధ్య‌క్షురాలిగా పోటీ చేసిన‌ప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా లేడీ స‌పోర్ట‌ర్స్ అంతా న‌న్ను మెజారిటీతో గెలిపించిన  సినీప్ర‌ముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయ‌కూడ‌దు. నువ్వుంటే బావుంటుంది. ఎవ‌రైనా క‌ష్టాలు చెప్పుకోవాల‌న్నా అర్థ రాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు. అందుకే నువ్వు కావాలి అని అడుగుతున్నారు. నేను పోటీ చేయ‌న‌ని నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. ఇండిపెండెంట్ గా పోటీ స‌మ‌యంలో నాకు అండ‌గా నిలిచిన వారంద‌రికోసం నా వారి కోసం మా  ఎన్నిక‌ల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాల‌నుకుంటున్నా` అని తెలిపింది హేమ. దీంతో `మా` ఎన్నికలు ఈ సారి మరింత రంజుగా మారబోతున్నాయని చెప్పొచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios