ప్రముఖ నటి హేమకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉంది. వదిన, గయ్యాళి భార్య, తల్లి పాత్రల్లో ఆమె పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల హేమ వినయ విధేయ రామ చిత్రంలో కియారా అద్వానికి తల్లి పాత్రలో నటించింది. హేమ బిగ్ బాస్ 3 షోలో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇటీవల హేమ బిగ్ బాస్ షో గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేసింది. 

ఇటీవల రాజమండ్రిలో పర్యటించిన హేమ అక్కడ మీడియాతో మాట్లాడింది. ఓ ప్రముఖ షోలో పాల్గొనబోతున్నా. అక్కడ ఎన్నిరోజులు ఉంటానో తెలియదు. కానీ ప్రజలంతా మద్దతు తెలిపి తనని గెలిపించాలని కోరింది. 

తాను కుటుంబాన్ని వదలి ఎన్నిరోజులు ఉండగలను.. ప్రజలు నాకు మద్దతుగా నిలుస్తారా లేదా అనే విషయాలు పరీక్షించుకునేందుకు వెళుతున్నట్లు హేమ తెలిపింది. హేమతో పాటు యాంకర్ శ్రీముఖి, వరుణ్ సందేశ్ లాంటి సెలెబ్రిటీలు బిగ్ బాస్ షోలో పాల్గొనబోతున్నారు. ఆదివారం సాయంత్రం 9 గంటలకు బిగ్ బాస్ 3 ప్రారంభం కాబోతోంది.