భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్నానని తమిళ నటి విలాసిని తాజాగా ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే భర్త పెట్టిన ఇబ్బందుల గురించి ఓపెన్ గా చెప్పారు.  

ఆడవాళ్లకు వేధింపులు అనేవి అన్ని చోట్లా ఉంటాయి. చేసుకున్న భర్తలు కూడా తమ భార్యలకు నరకం చూపించడం క్షమించారని నేరం. భర్త వేధింపులు తాళలేక విడాకులు తీసుకున్నానని తమిళ నటి విలాసిని తాజాగా ఇంటర్వ్యూలో తెలియజేశారు. అలాగే భర్త పెట్టిన ఇబ్బందుల గురించి ఓపెన్ గా చెప్పారు. 

తన భర్త అకృత్యాలను వివరించింది విలాసిని. అతడు ఎన్నో దుర్మార్గపు పనులు చేశాడని చెప్పింది. పలుమార్లు రోజుల తరబడి కనిపించకుండా పోయేవాడని చెప్పుకొచ్చింది. అతడు శారీరకంగానే కాకుండా మాటలతోనూ తనను గాయపర్చేవాడని వాపోయింది. తన దగ్గరి నుంచే కాకుండా తన పేరెంట్స్‌ నుంచి కూడా డబ్బులు గుంజుతూ క్షోభకు గురి చేసేవాడని బాధపడింది. అయితే విడాకుల తర్వాత ఈ బాధల నుంచి ఉపశమనం కలిగిందని, ఇప్పుడు తాను సింగింగ్‌, యాక్టింగ్‌ కెరీర్‌ మీద దృష్టి పెడతానని తెలిపింది. 

ఈ సీరియల్‌ నటి సాయి గ్నప్రకాశ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవలు మొదలయ్యాయి. దీంతో కొంతకాలానికే ఈ దంపతులు విడిగా బతకడం మొదలు పెట్టారు. ఆ తర్వాత విడాకులు సైతం తీసుకున్నారు. రేడియో జాకీగా కెరీర్‌ ఆరంభించిన విలాసిని తర్వాత యాంకర్‌గా సత్తా చాటింది. తన హోస్టింగ్‌తో పలు షోలను విజయవంతంగా నడిపించిన ఆమె తనలోని నటనా కోణాన్ని వెలికి తీస్తూ బుల్లితెర మీద కూడా సత్తా చాటింది. తాజాగా తన విడాకుల గురించి స్పందించిందీ నటి.కాగా ఇళయరాజా భార్య సోదరుడి కూతురే విలాసిని.