స్టార్ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడుపై నటి సుధ పోలీసులకు పిర్యాదు చేశారు. గతంలో తనపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని, లేదంటే పరిణామాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారని ఆమె ఫిర్యాదులో వెల్లడించారు. విషయంలోకి వెళితే గత ఏడాది మేలో నటి సుధ శ్యామ్ కె నాయుడుపై ఛీటింగ్ కేసు పెట్టారు. పెళ్లి చేసుకుంటానని తనతో  సహజీవనం చేసి, ఇప్పుడు పెళ్లి చేసుకోవడం కుదరదని మోసం చేశాడని ఆమె కేసు పెట్టడం జరిగింది. 


ఈ కేసు విచారణలో ఉండగానే తాను రాజీపడినట్లు నకిలీ పత్రాలు సృష్టించి, కేసును తప్పు దోవపట్టించడానికి ప్రయత్నించాడని సుధ ఆరోపించారు. అలాగే గత ఏడాది ఆగస్టు నెలలో ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయిరాం తనను మాదాపూర్ పిలిచి, కేసు రాజీ చేసుకోవాలని హెచ్చరించడంతో, దుర్భాషలాడారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై శారీరక దాడికి కూడా వారు పాల్పడినట్లు ఆమె వెల్లడించడం జరిగింది. 


ఈ కేసు విషయంలో శ్యామ్ కె నాయుడు, అతని కుటుంబ సభ్యుల నుండి ప్రాణహాని ఉన్నట్లు సుధ ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా, స్టిల్ ఫోటోగ్రాఫర్ సాయి రామ్ పై జీరో ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసిన పోలీసులు  దర్యాప్తు చేస్తున్నారు.