Asianet News TeluguAsianet News Telugu

ఒంటిపై నూలుపోగు లేకుండా ఫోటో షూట్... రాహుల్ రవీంద్రన్ షాకింగ్ పోస్ట్

రాహుల్ రవీంద్రన్ అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో డైరెక్టర్ గా మారాడు రాహుల్. దర్శకుడిగా ఆయన మొదటి చిత్ర చిలసౌ మంచి విజయాన్ని అందుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా అందుకుంది ఆ చిత్రం.

actor rahul ravindran posts a nude photo of him social media post goes viral ksr
Author
Hyderabad, First Published Jul 7, 2021, 7:48 AM IST

తమిళ చిత్రం మాస్కోవిన్ కావేరి సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు రాహుల్ రవీంద్రన్. అందాల రాక్షసి చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా సక్సెస్ కాకపోవడంతో డైరెక్టర్ గా మారాడు రాహుల్. దర్శకుడిగా ఆయన మొదటి చిత్ర చిలసౌ మంచి విజయాన్ని అందుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డు కూడా అందుకుంది ఆ చిత్రం. ఇక యువ దర్శకులకు అవకాశం ఇవ్వడంలో ముందు ఉండే కింగ్ నాగార్జున ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది. 


ఓ ఫ్రెంచ్ మూవీ రీమేక్ గా వీరి కాంబినేషన్ లో తెరకెక్కిన మన్మథుడు 2 ఘోరంగా దెబ్బతింది. ఓ విధంగా నాగార్జున ఇమేజ్ ని డామేజ్ చేసింది ఈ చిత్రం. దీనితో రాహుల్ కి దర్శకుడిగా అవకాశాలు రావడం లేదు. మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వచ్చిన అవకాశాలు చేస్తూ పోతున్నాడు. నాని హీరోగా తెరకెక్కుతున్న శ్యామ్ సింగరాయ్ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్నట్లు సమాచారం. 


ఇది ఇలా ఉండగా సోషల్ మీడియాలో న్యూడ్ ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చాడు రాహుల్. అయితే అది తన చిన్ననాటి ఫోటో కావడంతో జనాలు బ్రతికిపోయారు. ఏడాది వయసులో ఉన్నప్పుడు ఒంటిమీద బట్టలు లేకుండా దిగిన తన ఫోటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన రాహుల్... జీవితంలో నేను చేసిన బోల్డ్ ఫోటో షూట్.. అంటూ కామెంట్ పెట్టాడు. ఈ పోస్ట్ వైరల్ కావడం జరిగింది. 


సింగర్ చిన్మయి రాహుల్ భార్య కాగా, ఆమె హేటర్స్ రాహుల్ ని కూడా సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ ఉంటారు. అయితే సోషల్ మీడియా ట్రోల్స్ కి రాహుల్ స్పందించిన దాఖలాలు చాలా తక్కువ. ఎవరు ఎంత ఘాటు వ్యాఖ్యలు చేసినా, ఆయన లైట్ తీసుకుంటారు. 

Follow Us:
Download App:
  • android
  • ios