Asianet News TeluguAsianet News Telugu

వాడు పోలీస్ అంటే కామెడీగా ఉంటుంది.. పొట్టి హీరో పై నాగబాబు సెటైర్లు!


పొట్టి హీరోల మీద నాగబాబు పరోక్షంగా సెటైర్లు వేశాడు. వాడు పోలీస్ అంటే నవ్వొస్తుంది అంటూ ఎగతాళి పూర్వకంగా మాట్లాడారు. పర్టిక్యులర్ గా ఓ హీరో గురించే నాగబాబు ఆ కామెంట్స్ చేశాడని సోషల్ మీడియాలో ట్రెండ్ నడుస్తోంది. 
 

actor nagababu indirect satires on ntr ksr
Author
First Published Feb 27, 2024, 2:26 PM IST

హీరో అనగానే కొన్ని ఫీచర్స్ గుర్తొస్తాయి. హీరోకి చక్కని రూపం, రంగు, ఎత్తు, ఆహార్యం ఉండాలి అంటారు. ఇక నటన, డైలాగ్ డెలివరీ, డాన్స్... వంటి టాలెంట్స్ కూడా అవసరమే. అయితే ఈ సమీకరణాలను కొందరు పటాపంచలు చేశారు. నల్లని రూపం కలిగిన రజినీకాంత్ దేశంలోనే అతిపెద్ద హీరో. బాలీవుడ్ ని శాసిస్తున్న సల్మాన్, షారుక్, అమీర్ ఖాన్ పొట్టి వాళ్లే. ప్రపంచంలోనే అందమైన హీరోల్లో ఒకడుగా పేరుగాంచిన హృతిక్ రోషన్... నంబర్ వన్ హీరో కాలేకపోయాడు. ఆయన గొప్ప డాన్సర్ కూడాను. 

అంతెందుకు పొట్టిగా ఉండే అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ తో సమానమైన ఇమేజ్ అనుభవించాడు. ఎన్టీఆర్, ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అంటారు. కాబట్టి అందం, ఆహార్యం ఉంటేనే హీరోగా సక్సెస్ అవుతాం అనేది కరెక్ట్ కాదు. అది ఇప్పటికే చాలా మంది విషయంలో రుజువైంది. కాగా నాగబాబు చేసిన కామెంట్స్ దీనికి విరుద్ధంగా ఉన్నాయి. 

పొట్టివాళ్ళు కొన్ని రకాల పాత్రకు సెట్ కారు. వాళ్ళను చూస్తే నవ్వు వస్తుంది. అంగీకరించలేము అన్నారు. ఇది వాస్తవమే అయినప్పటికీ.. ఇమేజ్ ఉన్న హీరోల విషయంలో కాదు. ఒక కమర్షియల్ హీరో అరవై ఏళ్ల వయసులో లవ్ స్టోరీలు చేసినా, కాలేజ్ స్టూడెంట్ గా కనిపించినా ఆడియన్స్ అంగీకరిస్తారు. అక్కడ పాత్ర కంటే హీరోయిజం, ఇమేజ్ హైలెట్ అవుతాయి. అవే సినిమాను నడిపిస్తాయి. అమీర్ ఖాన్ పొట్టి హీరో అయినా...  తలాష్, బాజీ చిత్రాల్లో పోలీస్ రోల్ చేశారు. ఇక ఏ ఎన్నార్ అయితే పదుల సంఖ్యలో ఆ పాత్ర చేసి ఉంటారు. 

కాగా నాగబాబు ఐదు అడుగుల మూడు అంగులాలు ఉన్న నటుడు పోలీస్ రోల్ చేస్తే కామెడీగా ఉంటుంది. నువ్వు పోలీస్ కాదులేరా అనిపిస్తుంది, అన్నారు. ఈ కామెంట్స్ ఓ హీరోకి ఆపాదిస్తూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ లో అందరికంటే తక్కువ ఎత్తున్న ఎన్టీఆర్ ని ఉద్దేశించే నాగబాబు మాట్లాడారంటూ పోస్ట్స్ పెడుతున్నారు. నాగబాబు ఉద్దేశం ఏదైనా ఇది సోషల్ మీడియా వార్ కి కారణం అయ్యింది. 

ఈ క్రమంలో వరుణ్ తేజ్ డ్యామేజ్ కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు. ఆయన ఉద్దేశం ఎవరినీ కించపరచాలని కాదు. క్యాజువల్ గా చెప్పారు. పొడుగ్గా ఉన్న నటులు ఆర్మీ ఆఫీసర్ రోల్ కి సెట్ అవుతారని చెప్పే క్రమంలో అలా మాట్లాడారని.. వరుణ్ అన్నాడు. నాగబాబు కామెంట్స్ మాత్రం వేరే విధంగా పోయాయి. మరి ఈ వివాదం ఎటు దారి తీస్తుందో చూడాలి. నిజానికి మెగా హీరోల్లో అల్లు అర్జున్, రామ్ చరణ్ కూడా పొట్టివారే... 

Follow Us:
Download App:
  • android
  • ios