Asianet News TeluguAsianet News Telugu

అన్ని తెలిసీ మా జారు మిఠాయి పాటను చిరంజీవి పాడాడు వాళ్ళు మూర్ఖులు, మోహన్ బాబు కామెంట్స్!

చిరంజీవి-మోహన్ బాబుకు మనస్పర్థలు ఉన్నాయనే వాదన పరిశ్రమలో ఉంది. ఈ క్రమంలో జారు మిఠాయి సాంగ్ చిరంజీవి సినిమాలో పాడటం ఆసక్తి రేపింది. దీనిపై మోహన్ బాబు తాజాగా స్పందించారు. 
 

actor mohan babu interesting comments on chiranjeevi ksr
Author
First Published Mar 26, 2023, 9:52 AM IST

చిరంజీవి-మోహన్ బాబు కుటుంబాల మధ్య వైరం ఇప్పటిది కాదు. 2007లో జరిగిన తెలుగు సినిమా వజ్రోత్సవ వేడుకల్లో వేదిక మీదెక్కి చిరంజీవి, మోహన్ బాబు ఒకరిపై మరొకరు పరోక్షంగా విమర్శలు చేసుకున్నారు. చిరంజీవికి లెజెండరీ యాక్టర్ పురస్కారం ఇచ్చి తనకు ఇవ్వకపోవడాన్ని మోహన్ బాబు తప్పుబట్టారు. అప్పటి నుండి వీరిద్దరూ ఎడమొహం పెడమొహం గానే ఉంటున్నారు. రెండేళ్ల క్రితం సడన్ గా దగ్గరయ్యారు. థిక్ ఫ్రెండ్స్ మాదిరి తయారయ్యారు. ఇద్దరూ కలిసి టూర్స్ కి కూడా వెళ్లారు. 

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు మళ్ళీ చిచ్చుపెట్టాయి. మోహన్ బాబు కుమారుడు విష్ణు అధ్యక్ష పదవికి పోటీపడ్డారు. ఆయన ప్రత్యర్థిగా ప్రకాష్ రాజ్ నిల్చున్నారు. ప్రకాష్ రాజ్ కి మద్దతు తెలిపిన మెగా ఫ్యామిలీ మంచు విష్ణుకు వ్యతిరేకంగా పనిచేసింది. విజయం మాత్రం మంచు విష్ణుదే అయ్యింది. గెలిచిన అనంతరం విష్ణు... చిరంజీవి అంకుల్ నన్ను రేసు నుండి తప్పుకోమన్నాడని పబ్లిక్ లో చెప్పాడు.చిరంజీవి మీద మోహన్ బాబు, విష్ణు ఆరోపణలు చేశారు. దీంతో చిరు-మోహన్ బాబుకు చెడిందన్న క్లారిటీ వచ్చేసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో జిన్నా మూవీలోని జారు మిఠాయి సాంగ్ చిరంజీవి పాడటం ప్రాధాన్యత సంతరించుకుంది. వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి ఒక కామిక్ సీన్లో జారు మిఠాయి పాట పాడారు. ఈ విషయం మీద మోహన్ బాబు తాజాగా స్పందించారు. జారు మిఠాయి సాంగ్ సక్సెస్ గురించి మాట్లాడుతుండగా... చిరంజీవి ప్రస్తావన వచ్చింది. 

మోహన్ బాబు మాట్లాడుతూ... అవును వాల్తేరు వీరయ్య మూవీలో చిరంజీవి జారు మిఠాయి సాంగ్ పాడాడు. నాకు ఆనందం వేసింది. అది విష్ణు మూవీలో సాంగ్ అని అతనికి తెలుసు. అయినా పాడారు. నా మీద, నా బిడ్డ మీద చిరంజీవికి ఉన్న ప్రేమ కారణంగానే జారు మిఠాయి పాట పాడారు. దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా మా ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో. కానీ కొందరు మూర్ఖులు దుష్ప్రచారం చేస్తుంటారు. అది వాళ్ళకే నష్టం కానీ మాకు కాదు... అని చెప్పుకొచ్చారు. చిరంజీవితో తనకు ఎలాంటి గొడవలు లేవని మరోసారి బల్ల గుద్దారు. 

Follow Us:
Download App:
  • android
  • ios