Asianet News TeluguAsianet News Telugu

మహేష్ బాబు యాక్సిస్ బ్యాంక్ డబ్బు అధికారుల స్వాధీనం!

సూపర్ స్టార్ మహేష్ బాబుకి జీఎస్టీ విభాగం షాకిచ్చింది. ప్రకటనల ద్వారా మహేష్ బాబు సంపాదిస్తోన్న ఆదాయానికి సర్వీస్ టాక్స్ చెల్లించకపోవడంతో ఆయన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. 

Actor Mahesh Babu's Bank Accounts Frozen Over Tax Dues
Author
Hyderabad, First Published Dec 28, 2018, 4:12 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి జీఎస్టీ విభాగం షాకిచ్చింది. ప్రకటనల ద్వారా మహేష్ బాబు సంపాదిస్తోన్న ఆదాయానికి సర్వీస్ టాక్స్ చెల్లించకపోవడంతో ఆయన బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు.

2007-2008 ఏడాది ప్రకటనల ఆదాయానికి గారు మహేష్ ఐటీ విభాగానికి రూ.18.5 లక్షలు బకాయిలు చెల్లించలేదని సమాచారం. దాదాపు రూ.73 లక్షలు పన్ను బాకీ పడ్డట్లు తెలుస్తోంది. ఈరోజు మహేష్ బాబు ఆఫీస్ లో జీఎస్టీ తనిఖీలు నిర్వహించింది. 

యాక్సిస్ బ్యాంక్ లో ఉన్న రూ.43 లక్షలను కమీషనర్ స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బు కోసం మహేష్ బాబుకి నోటీసులు పంపారు. టాలీవుడ్ సూపర్ స్టార్‌గా ఎదిగిన మహేశ్ బాబు 2005 నుంచి వాణిజ్య ప్రకటనల్లో నటిస్తున్నారు.

పలు ఉత్పత్తులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ యాడ్స్ ద్వారా సంపాదించిన ఆదాయానికి ఆయన సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదు. 

హీరో మహేష్ బాబుకు జిఎస్టీ షాక్: ఖాతాలు ఫ్రీజ్
 

Follow Us:
Download App:
  • android
  • ios