Asianet News TeluguAsianet News Telugu

కోట్ల లాటరీ తగలడంతో పోలీసులను ఆశ్రయించిన నటుడు బ్రహ్మాజీ

నాలుగు కోట్లకు పైగా డబ్బులు ఆయన గెలుచుకున్నట్లు సందేశం అందింది. తన మొబైల్ కి వచ్చిన ఆ సందేశాన్ని పోలీసులకు సోషల్ మీడియా ద్వారా చేరవేశారు బ్రహ్మజీ. 

actor brahmaji shares a fake message to cyber police ksr
Author
Hyderabad, First Published Jun 18, 2021, 12:58 PM IST


సీనియర్ నటుడు బ్రహ్మాజీకి కోట్ల లాటరీ తగిలింది. నాలుగు కోట్లకు పైగా డబ్బులు ఆయన గెలుచుకున్నట్లు సందేశం అందింది. తన మొబైల్ కి వచ్చిన ఆ సందేశాన్ని పోలీసులకు సోషల్ మీడియా ద్వారా చేరవేశారు బ్రహ్మజీ. విషయంలోకి వెళితే సైబర్ నేరగాళ్ల అరాచకాలు ఎక్కువైపోతున్నాయి. అమాయకుల పేరాశను ఆధారంగా మోసాలకు పాల్పడుతున్నారు. 


వేలకొలది మొబైల్ ఫోన్లకు మీ నంబర్ కోట్ల రూపాయల లాటరీ గెలుచుకుంది, అమౌంట్ పంపడానికి డీటెయిల్స్ కావాలని సందేశం పంపుతారు. అది నిజమే అని భావించిన అమాయకులు డీటెయిల్స్ తో పాటు ప్రాసెస్ చార్జెస్ పేరున వాళ్ళు అడిగిన డబ్బులు కూడా పంపుతారు. తమ వలలో చిక్కిన చేపల నుండి విడతల వారీగా లక్షలు వసూలు చేస్తారు ఈ మోసగాళ్లు. 


ఈ తరహా మెస్సేజ్ బ్రహ్మాజీకి రావడం జరిగింది. ఇలాంటి మోసపూరిత సందేశాలకు స్పందించవద్దని తెలియజేయడానికి బ్రహ్మాజీ సదరు మెస్సేజ్ స్క్రీన్ షాట్ ఫోటో తో పాటు సైబర్ పోలీసులను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. బ్రహ్మాజీ ట్వీట్ వైరల్ కావడం జరిగింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios